Nitish Kumar: బిహార్‌ సీఎంగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం

Nitish Kumar: బిహార్‌ సీఎంగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం
x

Nitish Kumar: బిహార్‌ సీఎంగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం

Highlights

బిహార్‌ సీఎంగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం పట్నాలోని గాంధీమైదాన్‌లో ప్రమాణస్వీకారోత్సవం హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా. జేపీ నడ్డా.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు

బిహార్‌ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరింది. జేడీయూ అధినేత ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎంగా నితీష్ కుమార్ పదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాతో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం, మంత్రులచే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ, ఢిల్లీ సీఎం జగన్, రేఖాగుప్తాతో పాటు ఎన్డీఏకు చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ర్టాల మంత్రులు పాల్గొన్నారు.

బీహార్ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని మోడీ సభా వేదికపై నితీష్ కుమార్ చేయి పట్టుకొని అభివాదం చేశారు. ప్రజలకు ప్రణామం చేస్తూ.. చేతిలో కండువాను ఎగురవేస్తూ సభకు హాజరైన వారిలో నూతనోత్తేజం నింపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories