రాహుల్‌ గాంధీకి కూడా నోబెల్‌ శాంతి బహుమతి..? కాంగ్రెస్‌ నేత ట్వీట్‌

రాహుల్‌ గాంధీకి కూడా నోబెల్‌ శాంతి బహుమతి..? కాంగ్రెస్‌ నేత ట్వీట్‌
x

రాహుల్‌ గాంధీకి కూడా నోబెల్‌ శాంతి బహుమతి..? కాంగ్రెస్‌ నేత ట్వీట్‌

Highlights

పరోక్షంగా రాహుల్ గాంధీకి కూడా శాంతి బహుమతి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నోబెల్‌ శాంతి బహుమతి గురించే చర్చ నడుస్తోంది. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ బహుమతిని ఈసారి వెనెజువెలా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడో అందుకున్నారు. తమ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకే ఈ గుర్తింపు దక్కిందని నోబెల్ కమిటీ ప్రకటించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి నోబెల్ బహుమతిపై ఆశలు పెట్టుకున్నా, ఆయన ఆశలపై నీళ్లు చల్లుతూ కమిటీ కొరీనా మచాడో పేరును ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వెనెజువెలాలో రాజ్యాంగ హక్కుల కోసం పోరాడిన మరియా కొరీనా మచాడోకు నోబెల్ బహుమతి లభించినట్లే, మన దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పరోక్షంగా రాహుల్ గాంధీకి కూడా శాంతి బహుమతి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు కొరీనా మచాడో, రాహుల్ గాంధీ ఉన్న ఫోటోలను జత చేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories