Ola Uber Rapido Strike: రేపు ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్ల 6 గంటల సమ్మె ఎందుకు?

Ola Uber Rapido Strike: రేపు ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్ల 6 గంటల సమ్మె ఎందుకు?
x

Ola Uber Rapido Strike: రేపు ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్ల 6 గంటల సమ్మె ఎందుకు?

Highlights

Ola Uber Rapido Strike: ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్లు ఫిబ్రవరి 7న 6 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చారు. కనీస చార్జీలు, ప్రైవేట్ వాహనాల వినియోగంపై కీలక డిమాండ్లు చేశారు.

Ola Uber Rapido Strike: ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్ ఆధారిత రైడ్ సేవలకు చెందిన డ్రైవర్లు ఫిబ్రవరి 7న ఆరు గంటలపాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. “ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్” పేరుతో ఈ నిరసన చేపడుతున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వెల్లడించింది.

దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్ కార్మికులు రేపు ఆరు గంటల పాటు రైడ్ హైలింగ్ యాప్స్ నుంచి లాగ్ అవుట్ అవుతారని యూనియన్ తెలిపింది. కనీస చార్జీలపై ప్రభుత్వ నోటిఫికేషన్ లేకపోవడం, ప్రైవేట్ వాహనాలను వాణిజ్య ప్రయాణాలకు ఉపయోగించడం వల్ల లైసెన్స్ ఉన్న డ్రైవర్లకు నష్టం జరుగుతోందని యూనియన్ ఆరోపించింది.

మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025 అమల్లో ఉన్నప్పటికీ, యాప్ సంస్థలు స్వచ్ఛందంగా చార్జీలను నిర్ణయిస్తున్నాయని యూనియన్ పేర్కొంది. డ్రైవర్ల ఆదాయం తగ్గిపోవడం, ఉపాధి భద్రత లేకపోవడం వల్ల సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపింది.

యూనియన్ ప్రధానంగా రెండు డిమాండ్లు పెట్టింది. యాప్ ఆధారిత ఆటోలు, క్యాబ్‌లు, బైక్ టాక్సీలకు కనీస బేస్ ఫేర్‌ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరింది. అలాగే ప్రైవేట్ నాన్-కమర్షియల్ వాహనాలను వాణిజ్య ప్రయాణాలకు వినియోగించడాన్ని కఠినంగా నిషేధించాలని డిమాండ్ చేసింది.

ఆర్థిక సర్వే 2025–26 ప్రకారం దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా, వారి ఆదాయం అస్థిరంగా ఉందని పేర్కొంది. సుమారు 40 శాతం గిగ్ వర్కర్లు నెలకు రూ.15 వేల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నారని సర్వే తెలిపింది. ఫిబ్రవరి 7న జరగనున్న ఈ ఆరు గంటల సమ్మెతో పలు నగరాల్లో రైడ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories