Operation Chhatru: జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ ఛత్రు': భద్రతా బలగాలు - ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

Operation Chhatru: జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ ఛత్రు: భద్రతా బలగాలు - ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
x

Operation Chhatru: జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ ఛత్రు': భద్రతా బలగాలు - ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

Highlights

Operation Chhatru: జమ్మూకశ్మీర్‌లోని కిష్తివాడ్ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం తెల్లవారుజామున 'ఆపరేషన్ ఛత్రు'ను ప్రారంభించాయి.

Operation Chhatru: జమ్మూకశ్మీర్‌లోని కిష్తివాడ్ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం తెల్లవారుజామున 'ఆపరేషన్ ఛత్రు'ను ప్రారంభించాయి. కిష్తివాడ్‌లోని ఛత్రు ప్రాంతంలో సుమారు మూడు నెలలుగా ముగ్గురు ఉగ్రవాదులు రహస్యంగా దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే, భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్ (White Knight Corps) మరియు కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

ఉగ్రవాదులను గుర్తించిన వెంటనే భద్రతా దళాలు వారిని లొంగిపోవాలని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఛత్రు ఇంకా కొనసాగుతోందని, ఉగ్రవాదులను హతమార్చేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories