Iran US Israel War: గల్ఫ్ నుంచి భారతీయుల తరలింపు.. రంగంలోకి ప్రత్యేక విమానాలు..

Iran US Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు.

Arun Chilukuri
Published on: 3 March 2026 2:22 PM IST
Iran US Israel War: గల్ఫ్ నుంచి భారతీయుల తరలింపు.. రంగంలోకి ప్రత్యేక విమానాలు..
X

Iran US Israel War: గల్ఫ్ నుంచి భారతీయుల తరలింపు.. రంగంలోకి ప్రత్యేక విమానాలు..

Iran US Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉన్న భారతీయులను అప్రమత్తం చేస్తూ.. సంబంధిత దేశాల భారత రాయబార కార్యాలయాలు హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు అత్యధికంగా ఉండే గల్ఫ్ దేశాల్లో UAE నుంచి ఎక్కువమందిని తిరిగి తీసుకురానున్నారు.

జెడ్డా నుంచి 10 ప్రత్యేక విమానాలు నడపనుంది ఇండిగో ఎయిర్‌లైన్స్. పుజైరా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి స్పైస్‌జెట్ 4 ప్రత్యేక విమానాలు నడుపిస్తోంది. సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఓమన్.. దేశాల్లోని భారతీయులను ప్రత్యేక విమానాల్లో తిరిగి భారత్ తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story