Delhi Bomb Scare: ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో విద్యార్దులు, తల్లిదండ్రులు

Delhi Bomb Scare
x

Delhi Bomb Scare: ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో విద్యార్దులు, తల్లిదండ్రులు

Highlights

Delhi Bomb Scare: దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్దులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

Delhi Bomb Scare: దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్దులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. మరోపక్క పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగారు. బెంగుళూరులోనూ పలు స్కుళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైపోయింది. ఈమెయిల్స్ ద్వారా పలు స్కూళ్లకు, ఆఫీసులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే తాజాగా ఢిల్లీలో ఏకంగా 20కి పైనే స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా విద్యార్దులు, తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. పోలీసులు డాగ్, బాంబ్ స్వ్కాడ్‌ టీంలను రంగంలోకి దించారు.

శుక్రవారం వరసనగా అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారంలో ఇలాంటి బెదిరిపులు రావడం ఇది నాలుగో సారి. వరుస బెదింపులతో స్కూళ్ల యజమానులు కంగారు పడి పోలీసులకు సమాచారాన్ని ఇస్తున్నారు. విద్యార్దులు, తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో దేశ రాజధాని అంతటా భయాందోళనలు వ్యాపించాయి. దీంతో పోలీసులు మోహరించి విద్యార్దులను బయటపంపి స్కూళ్లలోపల తనిఖీలు చేస్తున్నారు.

ఢిల్లీలోని ద్వారకానగర్‌‌లో ఉన్న సెయింట్ థామస్ స్కూల్, జిడి గొయెంకా స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, గురునానక్ పబ్లిక్ సావరిన్ స్కూల్ అదేవిధంగా రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్‌‌లోని రిచ్ మండ్ స్కూల్ వంటి స్కూళ్లకు మీ స్కూళ్లో బాంబులు పెట్టామనే బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు. అన్ని స్క్వాడ్‌లు కలిసి టీంలుగా విడిపోయి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మధ్య ఈమెయిల్ ద్వారా ఎక్కువగా స్కూళ్లకు, ఆఫీసులకు బాంబు బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories