PM Kisan: 70 లక్షల మందికి పీఎం కిసాన్ కట్! మీ పేరు లిస్టులో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

PM Kisan: 70 లక్షల మందికి పీఎం కిసాన్ కట్! మీ పేరు లిస్టులో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
x
Highlights

పీఎం కిసాన్ 21వ విడతలో 70 లక్షల మందికి నిధులు బంద్. 22వ విడత సాయం అందాలంటే రైతులు వెంటనే ఈ-కేవైసీ మరియు ల్యాండ్ సీడింగ్ పూర్తి చేసుకోవాలి. స్టేటస్ చెక్ చేసుకునే విధానం ఇక్కడ చూడండి.

దేశవ్యాప్తంగా సాగు చేస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గత నవంబర్‌లో విడుదల చేసిన 21వ విడత నిధుల్లో ఏకంగా 70 లక్షల మంది రైతులకు మొండిచేయి ఎదురైంది. సాంకేతిక కారణాలు మరియు రికార్డుల్లో తప్పుల వల్ల వీరి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఇప్పుడు 22వ విడత నిధులు విడుదలయ్యే సమయం దగ్గర పడుతుండటంతో, లబ్ధిదారులు తమ స్టేటస్‌ను సరిచూసుకోవడం అత్యవసరం.

డబ్బులు ఎందుకు ఆగిపోయాయంటే?

పథకంలో పారదర్శకత కోసం కేంద్రం చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియలో లక్షలాది మంది అనర్హులను గుర్తించారు. ప్రధానంగా ఈ క్రింది కారణాల వల్ల 21వ విడత నిధులు నిలిచిపోయాయి:

ఈ-కేవైసీ (e-KYC): కేవైసీ పూర్తి చేయని రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించారు.

ల్యాండ్ సీడింగ్ (Land Seeding): భూ రికార్డులకు, పీఎం కిసాన్ డేటాకు సంబంధం లేకపోవడం.

ఆధార్ - బ్యాంక్ లింక్: బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం లేదా DBT (Direct Benefit Transfer) ఎనేబుల్ లేకపోవడం.

పేర్ల నమోదులో తప్పులు: ఆధార్ కార్డులో ఉన్నట్లుగా కాకుండా, దరఖాస్తులో పేర్లు తప్పుగా ఉండటం.

లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేయండి (Step-by-Step):

మీరు 22వ విడత రూ. 2,000 పొందాలంటే, వెంటనే మీ స్టేటస్ తనిఖీ చేసుకోండి:

  1. మొదట అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లండి.
  2. హోమ్ పేజీలో 'Farmers Corner' విభాగంలో 'Know Your Status' పై క్లిక్ చేయండి.
  3. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ టైప్ చేయండి.
  4. ఇప్పుడు మీకు 'Eligibility Status' కనిపిస్తుంది. అందులో e-KYC, Land Seeding, Aadhaar Bank Account Mapping అనేవి 'YES' అని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి.

తప్పులు ఉంటే ఏం చేయాలి?

ఒకవేళ మీ స్టేటస్‌లో ఏదైనా సమస్య ఉంటే, వెంటనే సమీపంలోని మీ-సేవా కేంద్రానికి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్‌ను సంప్రదించండి. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో 22వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నందున, అంతకంటే ముందే మీ రికార్డులను అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories