PM Modi at India AI Summit: యువతరమే భారత్ బలం.. ప్రధాని మోడీ

PM Modi at India AI Summit: యువతరమే భారత్ బలం.. ప్రధాని మోడీ
PM Modi at India AI Summit: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
PM Modi at India AI Summit: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ సమ్మిట్'లో పాల్గొన్న ఆయన.. సాంకేతిక పరిజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలు, భవిష్యత్తు సవాళ్లపై దిశానిర్దేశం చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన యువత భారత్లో ఉన్నారని ప్రధాని కొనియాడారు. ఈ ఏఐ సదస్సు భారత యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, ప్రపంచ ఏఐ రంగానికి భారత్ ఒక కేంద్రంగా (Hub) మారుతోందని ఆయన వెల్లడించారు.
మానవ మేధస్సు పరిణామ క్రమాన్ని వివరిస్తూ.. "ఆది మానవుడు కనుగొన్న నిప్పురవ్వ నుంచి నేటి ఏఐ యుగం వరకు మనిషి అద్భుతాలు సృష్టిస్తూనే ఉన్నాడు. అణుశక్తిని మనం చూశాం.. దాంతో సంక్షోభాలు రావచ్చు లేదా సంక్షేమం జరగవచ్చు. ఏఐ విషయంలో కూడా మనం దానిని మంచి కోసం మాత్రమే ఉపయోగించేలా ప్రయత్నించాలి" అని మోదీ పిలుపునిచ్చారు.
టెక్నాలజీ వినియోగంపై స్పష్టమైన సందేశమిస్తూ.. "ఏఐ మనల్ని శాసించకూడదు, మనమే ఏఐని శాసించాలి. సాంకేతికత అనేది మానవాళి అభివృద్ధికి ఒక సాధనంగా మాత్రమే ఉండాలి" అని సూచించారు. ఏఐ ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి కృషి చేయాలని శాస్త్రవేత్తలు, యువతకు ఆయన దిశానిర్దేశం చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



