G7 Summit: కెనడా చేరుకున్న ప్రధాని మోదీ.. G7 సదస్సులో మోదీ అజెండా ఏంటి?

PM Modi Canada Visit G7 Summit Details
x

G7 Summit: కెనడా చేరుకున్న ప్రధాని మోదీ.. G7 సదస్సులో మోదీ అజెండా ఏంటి? 

Highlights

G7 Summit: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. అక్కడ జరిగే G7 సదస్సులో పాల్గొననున్నారు.

G7 Summit: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. అక్కడ జరిగే G7 సదస్సులో పాల్గొననున్నారు. కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఘనంగా స్వాగతించారు. 2015 తర్వాత మోదీ మళ్లీ కెనడాలో పర్యటించడం ఇదే మొదటిసారి.

కెనడాలోని కననాస్కిస్‌లో G7 సదస్సు జరగనుంది. ఏడు దేశాల ముఖ్యనేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ G7 సదస్సులో ప్రధానిగా నరేంద్ర మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం. కీలక నేతలు కెనడా రానున్నందున కెనడా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసింది. ఈ సదస్సులో అంతర్జాతీయంగా ఎదుర్కోంటున్న సమస్యలు, ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి ప్రధాన ప్రపంచ అంశాలపై దృష్టి పెట్టనున్నారు. దీంతో ఎఐ పవర్ గురించి ఈ సదస్సులో మాట్లాడనున్నట్టు సమాచారం. మోదీ మూడు రోజుల ప్రపంచ పర్యటనలో ఉన్నారు. సైప్రస్ నుండి కెనడాకు చేరుకుని ఈ సదస్సులో పాల్గొననున్నారు.

అజెండా ఏంటి?

ఈ సదస్సులో మోదీ G7 ఔట్రీచ్ సెషన్‌లో ప్రసగిస్తారు. ఇందులో పలు కీలక అంశాలను చేర్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్ర క్రొయేషియాకు బయలుదేరే ముందు కెనడా ప్రధాని కార్నీతో కలిసి పలు ద్వైపాక్షిక సమావేశాలను కూడా ఆయన నిర్వహించనున్నారు. అయితే మోదీ క్రొయేషియాలో పర్యటించడం ఇదే మొదటిసారి.

Show Full Article
Print Article
Next Story
More Stories