PM Modi speech: ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఫస్ట్ స్పీచ్‌లో కాంగ్రెస్, ఆప్‌పై మోదీ సెటైర్లు

PM Modi speech after winning Delhi Assembly elections results 2025 and takes a jibe at Arvind Kejriwal
x

PM Modi speech: ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రధాని మోదీ ఫస్ట్ స్పీచ్... అరవింద్ కేజ్రీవాల్ అద్దాల మేడపై కాగ్ రిపోర్టులో ఏముందో తెలుసా?

Highlights

Delhi Assembly elections results 2025: ఢిల్లీ ఓటర్లు రాజకీయాల్లో అవినీతిని, అబద్దాల పాలనను ఎంతో కాలం సహించలేరని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వారికి...

Delhi Assembly elections results 2025: ఢిల్లీ ఓటర్లు రాజకీయాల్లో అవినీతిని, అబద్దాల పాలనను ఎంతో కాలం సహించలేరని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వారికి పరిపాలన కావాలి కానీ నాటకావాలు కావన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపి గెలుపును అభివృద్ధికి, లక్ష్యానికి, నమ్మకానికి గెలుపుగా అభివర్ణించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపి ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో అధికారంలోకి రావాలన్న బీజేపి మూడు దశాబ్దాల కల ఈ ఎన్నికల ఫలితాలతో తీరింది. 70 స్థానాలున్న ఢిల్లీలో బీజేపి 48 స్థానాల్లో గెలిచి ఘన విజయం సొంతం చేసుకుంది. గత రెండు ఎన్నికల్లోనూ 60 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కేవలం 22 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ ఘన విజయం తరువాత మొదటిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆప్, కాంగ్రెస్ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అవినీతికి వ్యతిరేకమని చెప్పుకుని పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది మోదీ అన్నారు. ఆ పార్టీ నేతలు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. లిక్కర్ స్కామ్, స్కూల్ స్కామ్ వంటి కేసులు ఢిల్లీ ప్రతిష్టను తలదించుకునేలా చేశాయన్నారు. దేశమంతా కొవిడ్-19 సమస్యతో సతమతమవుతుంటే... అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అద్దాల మేడ కట్టుకున్నాడని ఆరోపించారు. కేజ్రీవాల్ ఏం చేశారో చెప్పే కాగ్ రిపోర్ట్ ను ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ఢిల్లీ వాసులకు గ్యారెంటీ ఇస్తున్నానని మోదీ అన్నారు. మోదీ ఇంకా ఏమేం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం....

Delhi Elections Results 2025: ఢిల్లీలో బీజేపి ఎలా గెలిచింది? ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడింది?

Delhi Polls Results 2025: ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి 5 కారణాలు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత పని చేసింది!!

Show Full Article
Print Article
Next Story
More Stories