PM MODI TOUR: ఈ సారి ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. జులై 2 నుంచి టూర్ స్టార్ట్

PM MODI TOUR: ఈ సారి ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. జులై 2 నుంచి టూర్ స్టార్ట్
x
Highlights

PM MODI TOUR: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి 9 వరకు వివిధ దేశాల్లో తిరగనున్నారు. ఆయా దేశాల అధినేతలను కలిసి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచనున్నారు.

PM MODI TOUR: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి 9 వరకు వివిధ దేశాల్లో తిరగనున్నారు. ఆయా దేశాల అధినేతలను కలిసి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచనున్నారు. ఈ ట్రిప్‌లో మూడు దేశాల్లో మోదీ తొలిసారి పర్యటించనున్నారు. వివరాల్లోకి వెళ్లితే..

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి ఐదు దేశాల్లో తిరగనున్నారు. జులై 2 నుంచి 9 వరకు ఘనా, ట్రినిడాడ్, అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటనలో మోదీ బిజీ కానున్నారు. మొదట అంటే జులై 2 నుంచి 3 వ తేదీ వరకు మోదీ ఘనాలో పర్యటిస్తారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత మోదీ ఒక ప్రధాని హోదాలో పర్యటించడం విశేషం. ఈ దేశంతో ఆర్థిక, రక్షణ, ఇంధన రంగాలు వంటి ద్వైపాక్షిక ఒప్పందాలపై మోదీ చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు రెండు దేశాలకు చాలా అవసరం. ఈ చర్చల ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్ధిక సంఘం, ఆఫ్రికన్ యూనియన్‌తో భారత దేశ సంబంధాలు మరింత బలపడతాయి.

ట్రినినాడ్ అండ్ టోబాగో పర్యటన

జులై 2 , 3 తేదీలో ఘనాలో పర్యటించిన తర్వాత అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టోబాగోకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌ బిస్సేసర్‌‌ను కలిసి దైపాక్షిక చర్చలు జరపనున్నారు. అయితే ప్రధాని మోదీ ఈ దేశంలో పర్యటించడం ఇదే మొదటి సారి. అంతేకాదు 1999 తర్వాత T&Tకు ప్రధాన మంత్రి స్థాయిలో చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన కూడా. ఈ చర్చలు, ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌తో పాటు అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లతో కూడా మోదీ చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి.

అర్జెంటీనా పర్యటన

మూడో విదేశీ పర్యటనగా మోదీ జులై 4, 5 తేదీల్లో అర్జెంటీనాలో పర్యటించనున్నారు. రక్షణ, మైనింగ్, వ్యవసాయం, చమురు, గ్యాస్ , ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజా సంబంధాలు వంటి పలు కీలక రంగాలపై ఇరుదేశాలు చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఈ రెండు దేశాల ప్రధానులు చర్చలు జరుపుతారు.

బ్రెజిల్‌ పర్యటన

అర్జెంటీనా తర్వాత ప్రధాని మోదీ బ్రెజిల్‌లో పర్యటిస్తారు. బ్రెజిల్‌లో మూడు రోజులు పాటు ఉంటారు. అంటే జూలై 5 నుంచి 8 వరకు ఈ దేశంలో తిరగనున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వాను కలిసి పలు కీలక విషయాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఆ దేశంలో జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పాల్గొననున్నారు. శాంతి భద్రతలు, ఏఐ, వాతావరణం, ప్రపంచ ఆరోగ్యం, ప్రపంస్థ ఆర్ధిక విషయాలపై మోదీ ఈ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడనున్నారు. అదేరోజు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులతో కలిసి కూడా ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత రోజు బ్రెజిల్, ఇండియాకు సంబంధిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపి, ఒప్పంద పత్రాలపై ఇరుదేశాల ప్రదానులు సంతకాలు చేయనున్నారు.

నమీబియా పర్యటన

మోదీ విదేశీ పర్యటనలో చివరి పర్యటన నమీబియా. జులై 9న మోదీ ఈ దేశంలో పర్యటించనున్నారు. మొదటిసారి మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నమీబియా వ్యవస్థస్థాపక పితామహుడు ఆ దేశ మొదటి అధ్యక్షుడు డాక్టర్ సామ్ నుజోమాకు ఆ దేశా పార్లమెంట్‌లో ప్రసంగించి నివాళులు అర్పించనున్నారు. ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలపడే విధంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.

దాదాపు 8 ఎనిమిది రోజుల పాటు 5 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories