Putin-Modi Meet: భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు

Putin-Modi Meet: భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
x
Highlights

Putin-Modi Meet: తమ దేశంపై ఆంక్షలు ఉన్నా భారత్‌కు ఇంధన సరఫరా ఆగిపోదని స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

Putin-Modi Meet: తమ దేశంపై ఆంక్షలు ఉన్నా భారత్‌కు ఇంధన సరఫరా ఆగిపోదని స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ప్రధాని మోడీతో భేటీ అనంతరం మాట్లాడిన ఆయన.. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్న భారత్‌కు ఇంధన సహకారం కొనసాగుతుందని తెలిపారు. గతేడాది భారత్‌- రష్యా ద్వైపా‌క్షిక వాణిజ్యం 12 శాతం పెరిగిందని వెల్లడించారు.

ఎకానమీ కో ఆపరేషన్ ప్రోగ్రామ్‌‌తో భారత్‌- రష్యా వాణిజ్యం 2030 నాటికి వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పుతిన్. తమిళనాడులోని కుడంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories