Rahul Gandhi: ఓటర్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు

Rahul Gandhi: ఓటర్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు
x
Highlights

Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పారదర్శకతపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పారదర్శకతపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నవారిని ఈసీ కాపాడుతోందని ఆయన ఆరోపించారు. వంద శాతం ఆధారాలతోనే తాను ఈ ఆరోపణలు చేస్తున్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

కొంతమంది వ్యవస్థను హైజాక్ చేసి ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్‌కు బలం ఉన్న ప్రాంతాల్లో, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను పెద్దఎత్తున తొలగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఉదహరించారు. కర్ణాటకలో ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నంబర్లు తప్పుగా ఉన్నాయని, ఇది ఓట్ల తొలగింపుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని రాహుల్ ఆరోపించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories