Street Dogs: వీధి కుక్కల దాడిలో గాయాలైతే తిండిపెట్టిన వారిదే బాధ్యత – సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Street Dogs: వీధి కుక్కల దాడిలో గాయాలైతే తిండిపెట్టిన వారిదే బాధ్యత – సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
x

Street Dogs: వీధి కుక్కల దాడిలో గాయాలైతే తిండిపెట్టిన వారిదే బాధ్యత – సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Highlights

Street Dogs: వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులు సహా ఎవరికైనా వీధి కుక్కల దాడిలో గాయాలు జరిగితే, ఆ కుక్కలకు ఆహారం అందించిన వారే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

Street Dogs: వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులు సహా ఎవరికైనా వీధి కుక్కల దాడిలో గాయాలు జరిగితే, ఆ కుక్కలకు ఆహారం అందించిన వారే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వీధి కుక్కలపై నిజంగా అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని కూడా సూచించింది.

ఈ అంశంలో తమ ఆదేశాలను సరిగా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడుల్లో గాయపడిన బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని తేల్చి చెప్పింది.

చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినట్లయితే, కోర్టు నిర్దేశించిన పరిహారాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన రాష్ట్రాలపై కఠిన చర్యలు తప్పవని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories