ఆర్‌జీకర్ జూనియర్ డాక్టర్ హత్య కేసు: సంజయ్ రాయ్‌ కు జీవిత ఖైదు

ఆర్‌జీకర్ జూనియర్ డాక్టర్ హత్య కేసు: సంజయ్ రాయ్‌ కు జీవిత ఖైదు
x
Highlights

ఆర్‌జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య కేసుకు సంబంధించి కోల్‌కతా సీల్దా కోర్టు దోషి సంజయ్ రాయ్ కు సోమవారం జీవిత ఖైదు విధించింది. రూ. 50 వేల...

ఆర్‌జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య కేసుకు సంబంధించి కోల్‌కతా సీల్దా కోర్టు దోషి సంజయ్ రాయ్ కు సోమవారం జీవిత ఖైదు విధించింది. రూ. 50 వేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయనను దోషిగా జనవరి 18న కోర్టు నిర్ధారించింది. శిక్షను జనవరి 20న విధిస్తామని కోర్టు ప్రకటించింది. ఆగస్టు 9, 2024న ఆర్‌జీకర్ ఆసుపత్రి సెమినార్ హల్‌లో మృతదేహం కనిపించింది. అంతకుముందు రోజు ఆమె నైట్ షిఫ్ట్ లో పనిచేశారు.

డిన్నర్ సమయంలో పేరేంట్స్ తో ఫోన్ లో మాట్లాడారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని సహచర వైద్యులకు చెప్పిన ఆమె సెమినార్ హల్ కు వెళ్లింది. మరునాడు ఉదయం ఆసుపత్రి సిబ్బంది సెమినార్ హల్ లో ఆమె డెడ్‌బాడీని గుర్తించారు.జూనియర్ డాక్టర్ హత్య నేపథ్యంలో కోల్ కతా హైకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. ఆగస్టు 13 న ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శిక్ష ఖరారు చేసే ముందు సంజయ్ రాయ్ ఏమన్నారంటే?

ఈ కేసుకు సంబంధించి శిక్ష ఖరారు చేసే ముందు సంజయ్ రాయ్ కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు. తాను తప్పు చేసి ఉంటే తన ఒంటిపై ఉన్న రుద్రాక్షమాల తెగిపోయి ఉండేదని ఆయన అన్నారు. తనకు ఉరిశిక్ష కాకుండా శిక్షను తగ్గించలని కూడా ఆయన కోరారు. తననకు శిక్షను తగ్గించాలని ఆయన కోర్టును అభ్యర్ధించారు.తనను ఈ కేసులో ఓ ఐపీఎస్ అధికారి ఇరికించారని ఆయన ఆరోపించారు. తాను నేరం ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారన్నారు.జనవరి 18న కూడా సంజయ్ రాయ్ కోర్టులో బిగ్గరగా అరిచారు. తాను తప్పు చేయలేదు. తనను ఈ కేసులో ఇరికించారని కూడా అరిచారు. అయితే శిక్ష ఖరారు చేసే సమయంలో మాట్లాడే అవకాశం కల్పిస్తానని జడ్జి చెప్పారు. మరో వైపు సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష విధించాలని కోర్టును సీబీఐ కోరింది.

ఎవరీ సంజయ్ రాయ్?

కోల్ కతా పోలీసులు విపత్తుల కోసం ఏర్పాటు చేసిన వాలంటీర్ లో సంజయ్ రాయ్ 2019 నుంచి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్జీ‌కర్ ఆసుపత్రిలో ఆయనకు పోలీసులు డ్యూటీ అప్పగించారు. దీంతో ఆయన ఈ ఆసుపత్రికి వస్తుంటారు. అయితే జూనియర్ డాక్టర్ హత్య జరిగిన సెమినార్ హల్ కు ఆయన వెళ్లినట్టుగా సీసీటీవీ పుటేజీలో గుర్తించారు.హత్య జరిగిన స్థలంలో దొరికిన బ్లూటూత్ సంజయ్ రాయ్ ఉపయోగించే బ్లూటూత్ రాయ్ దేనని పోలీసులు గుర్తించారు.

ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు తీర్పు

ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ ఆగస్టు 9, 2024న డెడ్ బాడీని గుర్తించారు. ఈ ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు తీర్పు వెల్లడించింది. 120 మందికి పైగా సాక్షులను కోర్టు విచారించింది. అత్యంత అరుదైన కేసు అని వాదించిన సీబీఐ తరపు వాదనలతో కోర్టు విబేధించింది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్ ని మరణించే వరకు జైల్లోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories