Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. కాంట్రాక్టర్ గొంతుకోసి హత్య చేసిన మావోయిస్టులు

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. కాంట్రాక్టర్ గొంతుకోసి హత్య చేసిన మావోయిస్టులు
x

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. కాంట్రాక్టర్ గొంతుకోసి హత్య చేసిన మావోయిస్టులు

Highlights

Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ రోడ్డు కాంట్రాక్టర్‌ను గొంతు కోసి దారుణ హత్య చేశారు.

Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ రోడ్డు కాంట్రాక్టర్‌ను గొంతు కోసి దారుణ హత్య చేశారు. కొన్నిరోజుల క్రితం అకౌంటెంట్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కాంట్రాక్టర్ అతడిని కాపాడేందుకు వెళ్లగా.. మావోయిస్టులు అతడిని చంపారు. ఈ ఘటన పమేడ్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. హత్యకు గురైన కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్ నివాసి ఇంతియాజ్ అలీగా గుర్తించారు.

మొదట మావోయిస్టులు JCB క్లర్క్‌ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ వార్త అందగానే కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ ఘటనాస్థలానికి చేరుకున్నాడు. క్లర్క్‌ను కాపాడటానికి ప్రయత్నిస్తుండగా.. కాంట్రాక్టర్ పట్టుబడ్డాడు. మావోయిస్టులు అతడి గొంతు కోసి చంపారు. అనంతరం మావోయిస్టులు కిడ్నాప్‌కు గురైన JCB క్లర్క్‌ను విడిచిపెట్టారు. దీంతో ఈ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories