ఆరు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్

ఆరు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్
x
Highlights

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో దొంగ చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్‌ను ఆస్పత్రికి తరలించారు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో దొంగ చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజుల చికిత్స తర్వాత లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ తల్లి, భార్య కరీనా కపూర్, కుమార్తె సారా అలా ఖాన్ సాయంతో ఇంటికి చేరారు. అయితే ఒక వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అలాగే అతడి గాయాలు ఇంకా మానలేదు. దీంతో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని.. బయట వ్యక్తులను ఎవరినీ అనుమతించవద్దని చెప్పినట్టు తెలుస్తోంది.

జనవరి 16న ఓ దుండగుడు అర్ధరాత్రి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో సిబ్బంది అలర్ట్‌‌తో సైఫ్ అలీ ఖాన్ దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. దుండగుడు కత్తితో పొడవడంతో సైఫ్ అలీఖాన్‌కు గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సైఫ్‌నకు 5 గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి ఒక కత్తి ముక్కను కూడా బయటకు తీశారు.

మరోవైపు సైఫ్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను శనివారం అర్ధరాత్రి 2.50 గంటలకు థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటికి తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories