West Bengal: తీవ్ర విషాదం..గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు దుర్మరణం

West Bengal: తీవ్ర విషాదం..గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు దుర్మరణం
x
Highlights

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు మరణించారు....

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు మరణించారు. మరణించినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్తాలో పథార్ ప్రతిమా గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. కొంతమంది వ్యక్తులు ఈ ఇంటిని బాణా సంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. సోమవారం రాత్రి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

వెంటనే ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి. ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఉన్నారు. అందులో 7గురు మరణించారు. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. సిలిండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories