గుజరాత్‌ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు:18 మంది మృతి

గుజరాత్‌ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు:18 మంది మృతి
x
Highlights

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా దీసా బాణసంచా ఫ్యాక్టరీలో పలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు.


గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా దీసా బాణసంచా ఫ్యాక్టరీలో పలుడు సంభవించింది. ఈ ఘటనలో 18మంది మరణించారు.శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలింది. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురు స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ, ఇతర అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పేలుడు శబ్దాలు విని స్థానికులు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అప్పటికే ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. ఈ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం స్థానికులు, రెస్క్యూ బృందం ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారని బనస్కాంత కలెక్టర్ మిహిర్ పటేల్ చెప్పారు.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు.టపాకాయల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలు పేలుడుకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ టపాకాయల ఫ్యాక్టరీకి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories