Tamil Nadu Politics: త్రిముఖ పోటీ దిశగా తమిళనాడు రాజకీయాలు

Tamil Nadu Politics: త్రిముఖ పోటీ దిశగా తమిళనాడు రాజకీయాలు
x

Tamil Nadu Politics: త్రిముఖ పోటీ దిశగా తమిళనాడు రాజకీయాలు

Highlights

Tamil Nadu Politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు డీఎంకే, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి, విజయ్ టీవీకే మధ్య త్రిముఖ పోటీ పరిస్థితులు నెలకొన్నాయి.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే సాగుతున్న ప్రధాన పోటీ ఈసారి త్రిముఖంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార డీఎంకే, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి, అలాగే సినీనటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) రాజకీయ సమీకరణాలను మార్చేలా ముందుకు వస్తున్నాయి.

1967 తర్వాత తమిళనాడులో ద్రవిడ రాజకీయాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మారుమారుగా అధికారాన్ని చేపట్టాయి. అయితే ఈసారి కొత్త రాజకీయ శక్తుల ప్రవేశం ఎన్నికలను ఆసక్తికరంగా మార్చేలా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే “ద్రవిడ మోడల్ 2.0” నినాదంతో మరోసారి అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ఇతర మిత్రపక్షాల మద్దతు డీఎంకేకు బలం చేకూరుస్తోంది. పరిపాలనా స్థిరత్వం, సంక్షేమ పథకాల అమలు ప్రధాన అజెండాగా ముందుకు వస్తోంది.

ఇక అన్నాడీఎంకే–బీజేపీ కూటమి పునరుద్ధరణ ప్రయత్నాల్లో ఉంది. జయలలిత అనంతరం నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేకు బీజేపీతో పొత్తు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందా అన్నది చర్చనీయాంశమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు కూటమికి ప్రచార, నిర్వహణ పరంగా బలం చేకూర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కూడా అన్నాడీఎంకే ఓట్లపై ప్రభావం చూపవచ్చని అంచనా. జయలలిత అనంతరం పార్టీ అంతర్గత విభేదాలు ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం ఉంది.

సినీనటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ యువత, పట్టణ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలనే లక్ష్యంతో విజయ్ ముందుకు సాగుతున్నారు. అయితే బలమైన కేడర్ నిర్మాణం లేకపోవడం ఆయనకు సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories