దేశంలోనే మొట్టమొదటి మినీ హెలికాఫ్టర్ తయారీ కేంద్రం.. ఎక్కడంటే . .

దేశంలోనే మొట్టమొదటి మినీ హెలికాఫ్టర్ తయారీ కేంద్రం.. ఎక్కడంటే . .
x
Highlights

దేశంలోనే తొలి మినీ హెలికాఫ్టర్ తయారీ కేంద్రం ప్రారంభం కాబోతోంది. దీనిని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది.

బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన కర్ణాటకలోని కోలార్ జిల్లా జాతీయ స్థాయిలో మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధం అయిపొయింది. కోలార్ తాలూకాలోని వేమగల్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించిన టాటా ఎయిర్‌బస్ మినీ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ యూనిట్ రేపు (ఫిబ్రవరి 17) అధికారికంగా ప్రారంభం కాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి కేథరీన్ వౌట్రిన్ ఇద్దరూ కలిసి వేమగల్‌ను సందర్శించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో వేమగల్ పారిశ్రామిక ప్రాంతంలో గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎం.ఆర్. రవి, ఎస్పీ కనికా సిక్రివాల్ ఏర్పాట్లను పరిశీలించారు.

సంవత్సరానికి 10 హెలికాఫ్టర్ల తయారీ..

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ యూనిట్ దేశంలోనే మొట్టమొదటి మినీ సివిల్ హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ అని చెప్పొచ్చు. మొదటి దశలో, ఈ యూనిట్ సంవత్సరానికి పది H125 హెలికాప్టర్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి తగిన ప్రణాళికలు కూడా ఉన్నాయి.

దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం - చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేకు వేమగల్ పారిశ్రామిక ప్రాంతం దగ్గరగా ఉండటం కూడా ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ యూనిట్ ప్రారంభం స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది.అంతేకాకుండా కోలార్ జిల్లా పారిశ్రామిక వృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది.

ప్రాజెక్ట్ హై లైట్స్ ఇవే..

H125 అనేది ఒక స్ట్రాంగ్. సింగిల్-ఇంజన్ హెలికాప్టర్. ఇది ఎత్తైన పర్వతాలు లేదా అడవి వాతావరణం వంటి కఠినమైన ప్రదేశాలలో కూడా సురక్షితంగా సంచరించగలదు.

ఈ హెలికాఫ్టర్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది . మారుమూల ప్రాంతాలకు వైద్య సహాయానికి, పోలీస్ మిషన్స్ కోసం, ఎడ్వాంచర్ టూరిజం, వైమానిక ఉద్యోగాలకు ఈ హెలికాఫ్టర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ హెలికాఫ్టర్ ఎవరెస్టు శిఖరంపైకి వెళ్లిందంటే ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంత సురక్షితంగా పనిచేస్తుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఎవరెస్ట్ శిఖరాన్ని తాకిన ఏకైక హెలికాప్టర్ ఇదే!

కోలార్ ప్లాంట్‌లో, దిగుమతి చేసుకున్న ప్రధాన భాగాలను కలిపి, అత్యాధునిక సాంకేతికతను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి హెలికాఫ్టర్ ను తయారు చేస్తారు. అలాగే ఇక్కడే అత్యున్నత స్థాయి ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తారు.

టాటా -ఎయిర్‌బస్ జతకట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే గుజరాత్‌లోని వడోదరలో C295 విమానాల కర్మాగారం కోసం ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories