UP: భార్యకు లవర్ తో పెళ్లి చేసిన భర్త.. వీడియో ఇదిగో

UP: భార్యకు లవర్ తో పెళ్లి చేసిన భర్త.. వీడియో ఇదిగో
x
Highlights

UP: యూపిలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ అనే వ్యక్తి తన భార్యను ఆమె ప్రియుడు విశాఖ్ కుమారుకు ఇచ్చి పెళ్లి చేసిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది....

UP: యూపిలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ అనే వ్యక్తి తన భార్యను ఆమె ప్రియుడు విశాఖ్ కుమారుకు ఇచ్చి పెళ్లి చేసిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే తాజాగా అతను అలా ఎందుకు చేశాడో వివరించాడు. నేటికాలంలో భర్తలను వారి భార్యలు చంపడం మనం చూశామని బబ్లూ వార్త సంస్థ పీటీఐతో తెలిపారు. ఇటీవల దేశవ్యాపత్ంగా కలకలం రేపిన మీరట్ ఘటన ( వారం రోజుల క్రితం ముస్కాన్ అనే యువతి తన భర్తను ప్రియుడితో కలిసి చంపి డ్రమ్ములో దాయడం) తను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైందని తెలిపాడు.

మీరట్ లో ఏం జరిగిందో చూసిన తర్వాత తామిద్దరం ప్రశాంతంగా జీవించేలా నా భార్యను ఆమె ప్రియుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను అని బబ్లూ తెలిపాడు. కాగా వేరే రాష్ట్రానికి వెళ్లి కూలి పనులు చేసే బబ్లూకు రాధికతో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో రాధికకు విశాల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న బబ్లూ ఆమెను ప్రశ్నించగా..ఆమె తన ప్రియుడిని వదులుకునేందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో మీరట్ ఘటన తెలుసుకున్న బబ్లూ వారిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు హాని జరగకుండా ఉండేందుకు తానే స్వయంగా వారి పెళ్లికి ఏర్పాటు చేశానని చెప్పాడు. అతను మొదట కోర్టులో తన భార్య, ఆమె ప్రేమికుడి వివాహం జరిపించాడు. ఆపై వారిని ఒక ఆలయానికి తీసుకెళ్లి అక్కడ వారికి దండలు మార్పించాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories