Top 6 News @ 6PM: సన్‌రైజర్స్-హెచ్‌సీఏ వివాదంపై విజిలెన్స్ విచారణకు రేవంత్ ఆదేశం: మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News @ 6PM: సన్‌రైజర్స్-హెచ్‌సీఏ వివాదంపై విజిలెన్స్ విచారణకు రేవంత్ ఆదేశం: మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

1. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే: టీజీఐఐసీహైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ తెలిపింది. ఈ మేరకు సోమవారం టీజీఐఐసీ ఓ...

1. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే: టీజీఐఐసీ

హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ తెలిపింది. ఈ మేరకు సోమవారం టీజీఐఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ భూమి తమదేనని న్యాయస్థానంలో ప్రభుత్వం నిరూపించుకుందని టీజీఐఐసీ గుర్తు చేసింది. ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని తెలిపింది. అభివృద్దికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవన్నారు. ఒక్క అంగుళం కూడా సెంట్రల్ యూనివర్శిటీది కాదని తేలిందని టీజీఐఐసీ ప్రకటించింది.

టీజీఐఐసీ ప్రకటనను ఖండించిన హెచ్‌సీయూ

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హెచ్ సీ యూ అభ్యంతరం తెలిపింది. 2024 జూలైలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్ సీ యూ రిజిస్ట్రార్ ప్రకటించారు. ఇప్పటివరకు భూమి ఎలా ఉందని ప్రాథమి పరిశీలన మాత్రమే చేశారు.. హద్దులు అంగీకరించినట్టు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు.

2. 30 లక్షల మంది ఆఫ్గానీయుల బహిష్కరణకు యోచన?

పాకిస్తాన్ నుంచి 30 లక్షల మంది ఆఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. శరణార్థులుగా వచ్చిన వారు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ ఇప్పటికే కోరింది. ఈ గడువు పూర్తైనా కూడా ఇంకా దేశంలోనే ఉన్న ఆఫ్గన్ వాసులను దేశం నుంచి బయటకు పంపేందుకు బహిష్కరించాలని ఆ దేశం భావిస్తోంది. 2023 అక్టోబర్ నుంచి పాకిస్తాన్ ఈ అస్త్రాన్ని ప్రయోగించింది.

3. కొడాలి నాని ముంబైకి తరలింపు

కొడాలి నానికి మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు కుటుంబ సభ్యులు. ఐదు రోజులుగా కొడాలి నాని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక విమానంలో ఆయనను మార్చి 31 మధ్యాహ్నం ముంబైకి తరలించారు. గుండె సంబంధమైన సమస్యతో కొడాలి నాని ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఐదు రోజుల క్రితం గ్యాస్ట్రిక్ సమస్యతో కొడాలి నాని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

4. కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు

కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు పోలీసులు మార్చి 31న నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో మార్చి 31న విచారణకు రావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కానీ, విచారణకు హాజరు కాలేదు. దీంతో హైదరాబాద్ లోని ఆయన ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్లారు. అక్కడ కూడా ఆయన అందుబాటులో లేరు.దీంతో గోవర్ధన్ రెడ్డి బంధువులకు పోలీసులు నోటీసులు అందించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ గోవర్ధన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. ఈ తరుణంలో గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరౌతారా లేదా అనేది చూడాలి.

5. ఎస్ఆర్‌హెచ్- హెచ్‌సీఏ వివాదం: విజిలెన్స్ విచారణకు రేవంత్ ఆదేశం

హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సన్ రైజర్స్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. పాసుల కోసం ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని హెచ్ సి ఏ ఇబ్బంది పెట్టినట్టు వచ్చిన వార్తలపై ఆయన ఆరా తీశారు. ఈ విషయమై విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. పాసుల విషయంలో హెచ్‌సీఏ తమను ఇబ్బంది పెట్టిన విషయాన్ని సీఎం దృష్టికి ఎస్ఆర్ హెచ్ ప్రతినిధులు తీసుకెళ్లారు. ఈ విషయమై సీఎంఓ వివరాలు సేకరించింది.

6. హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్: రేవంత్ తో వ్యాన్ గార్డ్ సీఈఓ భేటీ

హైదరాబాద్ లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు వ్యాన్ గార్డు సంస్థ ప్రకటించింది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. వ్యాన్ గార్డు కంపెనీ సీఈఓ, ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్ నిపుణులకు అవకాశాలు లభించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories