Pahalgam Terror Attack : అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్డర్...48 గంటల్లో ఈ పని చేయాలని ఆదేశం

Pahalgam Terror Attack :  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్డర్...48 గంటల్లో ఈ పని చేయాలని ఆదేశం
x
Highlights

Pahalgam Terror Attack : కశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ కఠినమైన వైఖరిని అవలంబించేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే ...

Pahalgam Terror Attack : కశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ కఠినమైన వైఖరిని అవలంబించేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఉద్దేశించి వారికి జీవితాంతం గుర్తు ఉండిపోయేలా గుణపాఠం నేర్పిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడితో కేంద్రం అలర్ట్ అయింది. ఇప్పటికే సరిహద్దుల్లో రక్షణ దళాలను మోహరించడంతోపాటు, నిందితులను పట్టుకునేందుకు కేంద్ర పారా మిలటరీ దళాలతో పాటు భారత సైన్యం రంగంలోకి దిగి కాశ్మీర్ లోయను జల్లడపడుతుంది. తీవ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎవరిని విడిచి పెట్టమని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై, తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీ పౌరులను గుర్తించి వెంటనే 48 గంటల గడువు లోపల దేశం విడిచిపోవాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. కానీ గతంలో పాకిస్తానీ హిందువులకు ఇచ్చిన లాంగ్ టర్మ్ వీసాలు (LTVs) మినహాయింపు కల్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్ లో భద్రత సమీక్ష సమావేశంలో పాల్గొని అక్కడి పరిస్థితిని సమక్షించారు. అనంతరం ఢిల్లీలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో పాల్గొని ఈ కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

భారత్ ఉగ్రవాదం ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచదని దాడికి పాల్పడిన దుండగులను వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా అమిత్ షా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీనికి తోడు అమిత్ షా తన నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేసి సింధూ నది జలాల పంపిణీ కోసం 1960లో పాకిస్తాన్ తో జరిగిన ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఈ మేరకు జల శక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ, పాకిస్తాన్ ప్రతినిధికి లేఖ రాశారు. పాకిస్తాన్ నుంచి జరిగే సరిహద్దు ఉగ్రవాద చర్యలు ఒప్పంద నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ పరిణామాలపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబల్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను గీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కఠినంగా హెచ్చరించారు. మరోవైపు అంతర్జాతీయ సమాజం కూడా భారత్ వెంట నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాదంపై పోరులో భారత్ తీసుకునే నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories