రామలీలలో ఘోర అపశ్రుతి: రాముడి బాణం తగిలి 'రావణుడి' కన్ను అవుట్.. నిర్వాహకులపై అట్రాసిటీ కేసు!

UP Ramlila Mishap: ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఓ రామలీల ప్రదర్శనలో ఊహించని అపశ్రుతి చోటుచేసుకుంది.
UP Ramlila Mishap: ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఓ రామలీల ప్రదర్శనలో ఊహించని అపశ్రుతి చోటుచేసుకుంది. రావణ వధ ఘట్టంలో రాముడి పాత్రధారి సంధించిన బాణం గురితప్పి, రావణుడి పాత్ర పోషిస్తున్న వ్యక్తి కంటికి బలంగా తగిలింది. ఈ ప్రమాదంలో బాధితుడు తీవ్రంగా గాయపడగా.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఇప్పుడు చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి.
అసలేం జరిగిందంటే?
సోన్‌భద్ర జిల్లా షాగంజ్‌లో గతేడాది నవంబర్ 13న రామ్‌సనేహీ సింగ్ ఆధ్వర్యంలో రామలీల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సునీల్ కుమార్ 'రావణుడు'గా, నైతిక్ పాండే 'రాముడు'గా నటిస్తున్నారు. యుద్ధ ఘట్టం ప్రదర్శిస్తున్న క్రమంలో, నైతిక్ పాండే విడిచిన బాణం కిరీటానికి తగలాల్సి ఉండగా, నేరుగా వెళ్లి సునీల్ కుమార్ కంటికి తగిలింది. దీంతో కంటి నుంచి రక్తం కారి ఆయన స్పృహ తప్పి పడిపోయారు.
బెదిరింపులు.. కుల దూషణలు:
ప్రమాదం జరిగిన సమయంలో నిర్వాహకులు కనీసం వైద్య సహాయం కూడా అందించలేదని బాధితుడు ఆరోపించారు. చికిత్స కోసం ఖర్చులు అడగగా.. తనను కులం పేరుతో దూషించి, చంపేస్తామని బెదిరించారని సునీల్ కుమార్ వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా మొదట స్పందించలేదని, ఉన్నతాధికారుల జోక్యంతో తాజాగా కేసు నమోదైందని తెలిపారు.
పోలీసుల చర్యలు:
బాధితుడి ఫిర్యాదు మేరకు షాగంజ్ పోలీసులు నిర్వాహకుడు రామ్‌సనేహీ సింగ్, నటుడు నైతిక్ పాండేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
यूपी के सोनभद्र में रामलीला मंचन के दौरान 'राम' की तीर से रावण का किरदार निभा रहे शख्स की आंख की रोशनी चली गई
— Times Now Navbharat (@TNNavbharat) January 31, 2026
◆ इसके बाद 'राम' का किरदार निभा रहे नैतिक पांडेय और कार्यक्रम के आयोजक रामसनेही सिंह के खिलाफ SC/ST एक्ट में मामला दर्ज किया गया है
◆ बता दें कि, यह मामला 13 नवंबर… pic.twitter.com/4LgotEFjP9

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



