US Relief to India: యుద్ధం వేళ భారత్‌కు బిగ్ రిలీఫ్

US Relief to India: యుద్ధం వేళ భారత్‌కు బిగ్ రిలీఫ్
x

US Relief to India: యుద్ధం వేళ భారత్‌కు బిగ్ రిలీఫ్

Highlights

US Relief to India: పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ భారత్‌కు అమెరికా నుంచి బిగ్ రిలీఫ్‌ లభించింది.

US Relief to India: పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ భారత్‌కు అమెరికా నుంచి బిగ్ రిలీఫ్‌ లభించింది. సముద్రంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు ఇండియాకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ భారత్‌కు 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనివల్ల సముద్రంలో మార్గమధ్యలో చిక్కుకుపోయిన మిలియన్ల బ్యారెళ్ల రష్యా ఆయిల్‌ను ఇప్పుడు ఇండియా ఎలాంటి అడ్డంకులు లేకుండా తెచ్చుకునే అవకాశం లభించింది.

యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ కుప్పకూలకుండా ఉండేందుకే అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం సముద్రంలో ఇప్పటికే లోడ్ అయ్యి ఆగిపోయిన షిప్‌లకు మాత్రమే వర్తిస్తుందని కొత్తగా రష్యాకు ఆర్డర్లు ఇవ్వడానికి వీల్లేదని అమెరికా క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ కావాలనే గ్లోబల్ ఎనర్జీ సప్లైని బందీగా మార్చాలని చూస్తోందని.. దాన్ని అడ్డుకునేందుకే ఈ తాత్కాలిక మినహాయింపు ఇచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. రష్యాకు ఆర్థికంగా పెద్ద లాభం చేకూరకుండా కేవలం గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ సప్లై ఆగకుండా చూసేందుకే ఈ డెసిషన్ తీసుకున్నామని ఆయన వెల్లడించారు. అయితే.. ఈ 30 రోజుల గడువు ముగిసిన తర్వాత యుద్ధం ఆగకపోతే ఇండియా తదుపరి వ్యూహం ఏంటన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories