వచ్చింది డెలివరీ బాయ్ అనుకున్నారు.. కానీ బంగారం దోచుకెళ్లాడు

వచ్చింది డెలివరీ బాయ్ అనుకున్నారు.. కానీ బంగారం దోచుకెళ్లాడు
x

వచ్చింది డెలివరీ బాయ్ అనుకున్నారు.. కానీ బంగారం దోచుకెళ్లాడు

Highlights

ఇటీవల డెలివరీ బాయ్‌గా వచ్చి దారుణాలు జరిపిన ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా డెలివరీ బాయ్ డ్రెస్సులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. నగల దుకాణంలో దొంగతనానికి పాల్బడ్డారు.

ఇటీవల డెలివరీ బాయ్‌గా వచ్చి దారుణాలు జరిపిన ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా డెలివరీ బాయ్ డ్రెస్సులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. నగల దుకాణంలో దొంగతనానికి పాల్బడ్డారు. తాజాగా ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్యకాలంలో డెలివరీ బాయ్స్ చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్‌ దారుణాలకు పాల్బడడానికి అసలు కారణం ఏంటంటే వారిని ఎవర్రైనా లోపలికి రానిస్తారు. అది టౌన్ షిప్ కావొచ్చు.. గేటెడ్ కమ్యూనిటీలు కావొచ్చు, ఇళ్లు కావొచ్చు. డెలివరీ బాయ్ అంటే ఏదో మనం ఆర్డర్ పెట్టింది అతను డెలివరీ చేయడానికి వచ్చాడనే అందరూ నమ్ముతారు. దీంతో కొంతమంది డెలివరీ బాయ్స్ ఈ అవకాశాలు వాడుకుని దారుణాలకు పాల్బడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన సంఘటనలో ఇద్దరు దొంగలు డెలివరీ బాయ్ డ్రెస్సులో నగల దుకాణంలోకి ఎంటర్ అయిపోయారు. ఇక్కడ కూడా అదే జరిగింది. వీరు డెలివరీ బాయ్ డ్రెస్సు వేసుకోవడం వల్ల వాళ్లను కూడా దుకాణదారులు లోపలికి రానిచ్చారు. అయితే వాళ్లు లోపలికి వచ్చాక ఏం జరిగిందంటే..

ఉత్తర ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిజ్ విహార్‌‌ ప్రాంతంలో ఒక నగల దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులు డెలివరీ బాయ్ డ్రెస్సులతో లోపలికి వచ్చారు. అయితే ఆ సమయంలో యజమాని భోజనానికి వెళ్లాడు. అందులో పనిచేసే వ్యక్తి ఒక్కడే ఆ సమయంలో షాపులో ఉన్నాడు. ఇది ముందుగానే కనిపెట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు డెలివరీ బాయ్ ఏజెంట్లు అంటూ షాపులోపలికి వెళ్లారు. తీరా లోపలికి వెళ్లాక జేబులోంచి తుపాకీ చూపించి, షాపులో ఉన్న వ్యక్తిని బెదిరించారు. ఆ తర్వాత షాపులో ఉన్న బంగారం, వెండి వస్తువులను దోచుకున్నారు. అనంతరం బయట పార్క్ చేసుకున్న బైక్‌పై ఇద్దరు పారిపోయారు.

షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ధర్యాప్తులో భాగంగా షాపుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సిసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అయితే కొన్ని సీసీటీవీ పుడేజ్ ఆ ఇద్దరు దొంగలు కనిపించారు. దొంగతనానికి గురైన వస్తువుల విలువ దాదాపుగా రూ.30 లక్షల వరకు ఉంటుందని యజమాని పోలీసులకు చెప్పాడు. పలు రకాల కోణాల్లో పోలీసులు కేసును ధర్యాప్తు చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories