Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్‌ బిల్లు.. నెక్ట్స్ ఏం జరగనుంది?

Waqf Bill
x

Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్‌ బిల్లు.. నెక్ట్స్ ఏం జరగనుంది?

Highlights

Waqf Bill: వక్ఫ్ బిల్ ఏప్రిల్ 2న లోక్‌సభలో టేబుల్ కానుంది. పాలనా మార్పులపై విపక్ష వ్యతిరేకత మధ్య బీజేపీ మద్దతు సమీకరించేందుకు చర్చలు.

Waqf Bill: వక్ఫ్ బిల్ ఏప్రిల్ 2న లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2024 ఆగస్టులో సంయుక్త పార్లమెంటరీ కమిటీకు పంపిన ఈ బిల్లు, తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత చర్చకు సిద్ధమవుతోంది. బిల్లు ప్రవేశపెట్టే ముందు బీజేపీ నేతలు ఇండియా బ్లాక్ నేతలతో చర్చలు జరపనున్నారు. వక్ఫ్ బోర్డుల పాలన విధానంలో మార్పులు చేయడమే ఈ బిల్లులోని ప్రధాన ఉద్దేశం. ముస్లిం సమాజానికి చెందిన ధార్మిక, సేవా కార్యకలాపాల కోసం ఉద్దేశించిన ఆస్తుల నిర్వహణపై పారదర్శకత తీసుకురావాలని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ బిల్లుపై విపక్షాలు తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలపై దుష్ప్రభావం చూపుతుందని అంటున్నారు.

బిల్లు పూర్తిగా చర్చకు వచ్చే ముందు ఇప్పటికే సంయుక్త కమిటీ నివేదికను పార్లమెంటులో సమర్పించారు. అయితే కమిటీలోని 11 మంది విపక్ష ఎంపీలు అభిప్రాయ భేదాలతో వేరు వేరు అభిప్రాయాలను కూడా నమోదు చేశారు. మొత్తంగా 655 పేజీల నివేదిక పార్లమెంటులో టేబుల్ చేయనున్నారు.

ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్న నేపథ్యంలో, లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేయాలన్న బీజేపీ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో రాజకీయ గందరగోళాన్ని తొలగించేందుకు బిల్లు స్పష్టతగా ఉంటుందని.. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని కేంద్ర నేతలు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories