ఔరంగజేబ్ సమాధి కూలగొట్టాలని ఆందోళనలు... 300 ఏళ్ల క్రితం చనిపోయిన మొఘల్ సామ్రాట్‌పై ఇప్పుడు ఎందుకంత కోపం?

Why Aurangzebs tomb is big debate now
x

ఔరంగజేబ్ సమాధి కూలగొట్టాలని ఆందోళనలు... 300 ఏళ్ల క్రితం చనిపోయిన మొఘల్ సామ్రాట్‌పై ఇప్పటికీ ఎందుకంత కోపం?

Highlights

Why protesters demanding to remove Aurangzeb's tomb: కొన్ని హిందూ సంఘాలు ఔరంగజేబ్ సమాధిని పెకిలించి వేయాలని ఎందుకు

Why Aurangzeb's tomb is big debate now: ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలన్నీ ఔరంగజేబ్ సమాధి చుట్టే తిరుగుతున్నాయి. 300 ఏళ్ల క్రితం చనిపోయిన ఔరంగజేబ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు. ఇంతకీ మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధిని కూల్చేయాలని ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ ఆందోళనలు ఎందుకు హింసాత్మకం అవుతున్నాయి? కొన్ని హిందూ సంఘాలు ఔరంగజేబ్ సమాధిని పెకిలించి వేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? ఈ మొత్తం వివాదానికి ఛావ సినిమానే కారణం అని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎందుకు అన్నారు? ఛావ సినిమాకు, ఔరంగజేబ్ సమాధికి ఏం సంబంధం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఔరంగజేబ్... మొఘల్ సామాజ్రాన్ని పాలించిన ఆరో చక్రవర్తి. 1658 నుండి 1707 వరకు... అంటే దాదాపు 50 ఏళ్లు రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి.

1657 లో షాజహాన్ అనారోగ్యం బారినపడ్డాడు. షాజహాన్ నుండి అధికారాన్ని చేజిక్కునేందుకు ఆయన కుమారులైన ఔరంగజేబ్, దారా షికోల మధ్య పోటీ ఏర్పడింది. ఈ పోటీ కాస్త యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో తనకంటే పెద్దవాడయిన దారాను ఔరంగజేబ్ అంతమొందించాడు. ఆ తరువాత తండ్రి షాజహాన్ నిస్సహాయతను ఆసరాగా తీసుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అంతేకాదు.. తండ్రిని ఆగ్రా కోటలోని జైల్లో పెట్టాడు. 1666లో షాజహాన్ చనిపోయే వరకు అదే జైల్లో జీవితం గడిపాడు.

మరాఠీల దృష్టిలో హిందువుల పట్ల కర్కశంగా వ్యవహరించిన చక్రవర్తిగా ఔరంగజేబ్‌కు పేరుంది. హిందువుల నుండి వారి స్వీయ రక్షణ కోసమే జిజ్యా ట్యాక్స్ పేరుతో సుంకం వసూలు చేయడం, హిందూ దేవాలయాలను పడగొట్టేందుకు ఆదేశాలు ఇవ్వడం లాంటివి ఔరంగజేబ్‌ను హిందువుల వ్యతిరేకిగా మార్చేశాయనే అభిప్రాయం ఉంది.

మరాఠీలు తమ ప్రత్యక్ష దైవంగా భావించే ఛత్రపతి శివాజీ సైన్యంపై ఔరంగజేబ్ దండెత్తడం, శివాజీ కొడుకైన శంబాజీ మహరాజ్‌ను చంపేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం వంటివి హిందువుల్లో ఇప్పటికీ నాటుకుపోయాయని చెబుతుంటారు.

ఔరంగజేబ్ సమాధి చరిత్ర

1707 మార్చి 3న మహారాష్ట్రలోని అహ్మెద్ నగర్‌లో ఔరంగజేబ్ చనిపోయాడు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అహిల్యనగర్‌గా పిలుచుకుంటున్నారు. అప్పుడు ఆయన వయస్సు 88 ఏళ్లు. గత మొఘల్ చక్రవర్తులతో పోల్చుకుంటే ఔరంగజేబ్ సమాధి చాలా సాదాసీదాగా ఉంటుంది. అందుకు ఆయన చివరి కోరికే కారణం. కుల్దాబాద్‌లోని ఖ్వాజా సయ్యద్ జైనుద్దీన్ షిరాజీ ఈ ఔరంగజేబ్ కు ఆధాత్మిక గురువుగా ఉండే వారు. ఆయన సమాధి పక్కనే తనను కూడా సమాధి చేయాలనేది ఔరంగజేబ్ చివరి కోరిక. అందుకే అహ్మెద్ నగర్ నుండి కుల్దాబాద్ వరకు ఆయన పార్ధివదేహాన్ని అంతిమ యాత్రగా తీసుకెళ్లి అక్కడ సమాధి చేశారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని రౌజా అనే పిలిచే వారు. కానీ ఔరంగజేబ్‌ను సమాధి చేసిన తరువాత ఆయన గౌరవార్దం కుల్జాబాద్ అని పేరు మార్చారు.

తాజాగా వచ్చిన బాలీవుడ్ చిత్రం ఛావలో శంబాజీ మహరాజ్‌ను ఔరంగజేబ్ చంపించినట్లుగా చూపించారు. అది చూసి శివాజీనీ, శంబాజీని అభిమానించే వారి హృదయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఔరంగజేబ్ ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా కుల్జాబాద్‌లో ఉన్న ఆయన సమాధిని లేకుండా చేయాలనే నిర్ణయానికొచ్చారు. అదే డిమాండ్‌తో ఆందోళనకారులు చేపట్టిన నిరసన నాగపూర్‌లో పెద్ద విధ్వంసం, హింసకు దారితీసింది. ఈ హింసాకాండలో పెద్ద మొత్తంలో దుకాణాలు, వాహనాలు తగలబడిపోయాయి.

ఈ హింసాకాండపై మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఛావ సినిమా జనాల్లో ఉన్న ఆగ్రహాన్ని మరోసారి రెచ్చగొట్టిందన్నారు.

14 రూపాయల 12 అణాలతో సమాధి నిర్మాణం

ప్రస్తుతం ఔరంగజేబ్ సమాధి బాగోగులను షేక్ నిసార్ అహ్మెద్ కుటుంబం చూసుకుంటోంది. గత ఆరు తరాలుగా ఆ కుటుంబం బాధ్యత ఇదే. 2022 మే నెలలో ది ప్రింట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ నిసార్ మాట్లాడుతూ ఔరంగజేబ్ సమాధి వెనుకున్న కథను చెప్పారు.

ఒక సబ్జ చెట్టుకు సమీపంలో కేవలం మట్టితో మాత్రమే తన సమాధిని నిర్మించాలని ఔరంగజేబ్ కోరుకున్నట్లు చరిత్ర చెబుతోందని నిసార్ గుర్తుచేశారు. కేవలం 14 రూపాయల 12 అణా పైసలతో తన సమాధిని నిర్మించాలని ఆదేశించారట. ఆ డబ్బులను కూడా ఔరంగజేబ్ జీవితం చివరి రోజుల్లో టోపీలను తయారుచేసి సంపాదించినట్లుగా చెప్పారు.

మట్టితో తయారైన సమాధి చుట్టూ మార్బుల్ నేల, మూడు వైపులా మార్పుల్ గోడలు ఉంటాయి. నాలుగో వైపున దర్గా గోడ ఉంటుంది. ఈ దర్గా గోడను హైదరాబాద్ నిజాం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది.

Gold Rate: రూ. 64 నుంచి 90,000 దాకా బంగారం ధర ఎలా పెరిగింది? ఇంకెంత పెరుగుతుంది?

Show Full Article
Print Article
Next Story
More Stories