Tamilnadu Politics: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అన్నామలై ఒంటరిగా మిగిలిపోతారా?

Tamilnadu Politics
x

Tamilnadu Politics: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అన్నామలై ఒంటరిగా మిగిలిపోతారా?

Highlights

Tamilnadu Politics: తమిళనాడు రాజకీయాల్లో పొత్తుల కారణంగా బలహీనపడుతున్న అన్నామలై, తాత్కాలిక వెనుకంజ పడినా, భవిష్యత్తులో కీలకంగా మిగిలే అవకాశం ఉంది.

Tamilnadu Politics: కన్నడ ప్రాంతంలో జన్మించిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై, తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నేత. ఆయన తన ధైర్యసాహసాలతో, స్పష్టమైన మాట్లాడే విధానంతో రాష్ట్రవ్యాప్తంగా యువతలో ఆదరణ సంపాదించారు. డీఎంకే, ఏఐఎడీఎంకేపై పదే పదే విమర్శలు చేస్తూ తాను ఉన్నట్టుండి బీజేపీ ముఖచిత్రంగా మారిపోయారు.

2023లో జయలలిత, అన్నాదురైపై చేసిన వ్యాఖ్యలతో ఏఐఎడీఎంకేతో బీజేపీ పొత్తు తెగిపోగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బీజేపీ పోటీకి దిగింది. ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నా, ఒక్క సీటు గెలవలేకపోయింది. కానీ అన్నామలై రాజకీయ మాఫీ తీసుకుని తిరిగి వచ్చినప్పటికి, ఢిల్లీ నాయకత్వం మాత్రం పొత్తుల వైపు మొగ్గుచూపుతోంది.

ఇటీవల అమిత్ షాతో ఏఐఎడీఎంకే నేత ఎడప్పాడి పాలనిస్వామి భేటీ కావడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. పొత్తు కుదిరితే బీజేపీ జూనియర్ భాగస్వామిగా మిగిలిపోతుంది. ఇది అన్నామలైకి మైనస్ కావొచ్చు. ఆయన నేతృత్వంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆశపడుతున్నారు అనేక మంది యువ ఓటర్లు.

ఇక ఏఐఎడీఎంకే పెట్టిన షరతుల ప్రకారం, పొత్తును సమన్వయించే ప్రత్యేక కమిటీ ఏర్పాటవుతుంది. ఇది అన్నామలై స్థానాన్ని అధిగమిస్తుందన్న ఉద్దేశం. అంతేకాక, కుల సామరస్యానికి అనుగుణంగా మరో నేతను బీజేపీ టీఎన్ ప్రెసిడెంట్‌గా పెట్టే యోచన ఉందని ఊహాగానాలు ఉన్నాయి.

అన్నామలై తాత్కాలికంగా వెనక్కి తగ్గినా, రాజకీయంగా ఆయన శక్తిని ఢిల్లీ పక్కన పెట్టదు. అతను నరేంద్ర మోదీ, అమిత్ షాకు నచ్చిన నాయకుడు. వయస్సు ఇంకా 40 మాత్రమే. తక్కువ కాలంలో బలమైన ప్రజా మద్దతు సంపాదించిన నాయకుడిగా, ఆయనకు ముందు రాజకీయంగా మరిన్ని అవకాశాలున్నాయని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నామలై-బీజేపీ నాయకత్వం మధ్య సమన్వయం కష్టమైనా, పొత్తు అవసరమవుతుందని భావించి తాత్కాలికంగా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories