
OTT releases this week
OTT releases this week: ఈ వీకెండ్ లో క్రికెట్ తో పాటు.. ఓటీటీలో బోలెడు సినిమాలు , వెబ్ సిరీస్ లు సందడి చేయబోతున్నాయి . వాటి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు
OTT releases this week: ఇప్పుడు మన వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళ్లడం కంటే, ఓటీటీలో వచ్చే కంటెంట్ పైనే ఎక్కువ ఆధార పడుతున్నాం. ప్రతి వారం ఓటీటీ ప్రియులను అలరించడానికి కొత్త కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. చాలా ఓటీటీ ఛానల్స్ అందుబాటులోకి రావడంతో ప్రతి వారమూ ఓటీటీలో వచ్చే కంటెంట్ కూడా విపరీతంగా ఉంటుంది. కొత్త సిరీస్ లు, కొత్త షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు ఓటీటీని ప్రతి వారమూ పలకరిస్తాయి.
OTT releases this week: ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో చాలా సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. వాటిలో చాలావరకూ ప్రేక్షకుల మన్ననలు పొంది రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మార్చి నెల మొదటి వారంలో మరింత కొత్త కంటెంట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓటీటీ ప్రియులకు బోలెడంత వినోదాన్ని పంచడం కోసం నయా కంటెంట్ సిద్ధం అయిపోతోంది.
OTT releases this week: ఈనెల మొదటి వారంలో బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు ఏవీ లేవు. థియేటర్లలో కొన్ని చిన్న సినిమాలు మాత్రమే విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు ఓటీటీ కంటెంట్ వీకెండ్ లో మంచి కాలక్షేపం కావచ్చు. టీ20 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్స్ ఎలానూ క్రికెట్ ప్రియుల కోసం జియో హాట్ స్టార్ లో సందడి చేస్తాయి. ఇక మూవీ కంటెంట్ కోసం చూసే వారి కోసం..
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మార్చి6న నెట్ఫ్లిక్స్ లో ఒక తెలుగు డబ్బింగ్ మూవీ, ఒక ఇంగ్లీష్ మూవీ, హిందీ వెబ్ సిరీస్ రానున్నాయి. విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ మూవీ),
వార్ మెషీన్ (ఇంగ్లీష్ మూవీ), హలో బచ్చోన్ (హిందీ సిరీస్)
జియో హాట్స్టార్ లో మార్చి6న విక్రమ్ ఆన్ డ్యూటీ - తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో మార్చి 3న తన్వి ది గ్రేట్ (హిందీ మూవీ), మార్చి4న యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్), మార్చి5న సుబేదార్ (హిందీ మూవీ) మూవీ ప్రియులను అలరించనున్నాయి.
ఆహాలో ఓం శాంతి శాంతి శాంతిః మూవీ మార్చి 4న స్ట్రీమింగ్ అవుతుంది.
జీ5లో మార్చి6న తెలుగు డబ్బింగ్ మూవీ గాంధీ టాక్స్, హిందీ మూవీ జబ్ ఖులీ కితాబ్ స్టీమ్ అవుతాయి.
సోనీ లివ్ లో హిందీ మూవీ లాలో కృష్ణ సదా సహాయతే మార్చి 6న సందడి చేయనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




