శీతాకాలం వచ్చేసింది. దీంతో పాటు సీజనల్‌ వ్యాధులు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకే ఆహారంపై దృష్టి పెట్టాలి.
చలికాలంలో బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌ తాగడం వల్ల క్యాన్సర్‌ రాకుండా కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అధిక బీపీతో బాధపడేవారు శీతాకాలంలో క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది.
రక్తహీనతతో బాధపడేవారికి బీట్‌రూట్, క్యారెట్ దివ్యౌషధమని చెప్పాలి.
ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి.