వేసవిలో పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బాడీలోని వేడిని తీసేసి చలువ చేస్తుంది.
అయితే కొన్ని ఆహారాలతో పెరుగును ఎప్పుడు కలిపి తినవద్దు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
పాలు, పెరుగు సరైన కాంబినేషన్‌ కాదు. ఈ రెండింటిని కలపి తీసుకోవడం వల్ల అసిడిటీ, ఉబ్బరం, గుండెల్లో మంటకు దారితీస్తుంది. విరేచనాలు ఎదురవుతాయి.
మాంసాహారంలో పెరుగు కలిపి వండుతారు. కానీ చేపలకు మాత్రం ఇది వర్తించదు. సీఫుడ్స్‌తో పెరుగును కలపకూడదు. దీనివల్ల ఫుడ్‌ పాయిజన్‌ అవుతుంది.
గ్రామాల్లో పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు. దీనివల్ల అలెర్జీలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ, వాంతులు కలుగుతాయి. కారణం పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఉల్లిపాయ దీనికి విరుద్ధంగా ఉంటుంది.