గణపతి పూజలో ఇవి తప్పనిసరి.. లేదంటే పూజ అసంపూర్ణం..!
గణేశుడు భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు. ఈ రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.
వినాయకుడి పూజలో దర్భ గడ్డి కచ్చితంగా ఉండాలి. ఇదంటే ఆయనకి చాలా ప్రీతి. ఇది లేకుండా పూజ చేస్తే అది అసంపూర్ణం.
గణేశుని పూజలో పూలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తొమ్మిది రోజులు రకరకాల పూలతో పూజించాలి.
వినాయకుడి పూజలో పండ్లు తప్పనిసరి. ముఖ్యంగా అరటి పండు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ సీజన్​లో లభించే సీతాఫలం, యాపిల్స్​, ఎలక్కాయ మొదలైనవి ఉండాలి.