జ్ఞానేంద్రియాలలో కళ్లది మొదటిస్థానం. శరీరంలో ఇవి చాలా సున్నితమైన అవయవాలు. ఇవి లేకుండా ప్రపంచాన్ని చూడలేము. కాబట్టి వీటిని కాపాడుకోవడం చాలా అవసరం.
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ ఎ అత్యవసరం. ఇందుకోసం క్యారెట్, మామిడి, బొప్పాయి, ఆకు కూరలు వంటి విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాలి.
జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం నట్స్, ఓట్స్, బీన్స్ మొదలైన వాటిని డైట్ లో చేర్చుకోవాలి.
విటమిన్ ఇ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇందుకోసం నారింజ, నిమ్మ, బత్తాయి, ఉసిరి వంటి డైట్‌లో చేర్చుకోవాలి. సీజనల్‌ పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి.