ఈ అలవాట్ల వల్ల తలనొప్పి పెరుగుతుంది.. నివారించాలంటే ఇలా చేయండి
మైగ్రేన్ కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. తర్వాత మెదడు పనిచేయడం ఆగిపోతుంది. ఈ పరిస్థితిలో ఎలాంటి పనిచేయలేరు. వాంతులు, మైకము ఎదురవుతాయి.
తలనొప్పిని నివారించడానికి కొన్ని అలవాట్లను వదిలేయాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం
ఆధునిక కాలంలో పని ఒత్తిడి ఇంకా కుటుంబ సమస్యల వల్ల కూడా తలనొప్పి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడికి లోనుకావొద్దు. ప్రశాంతంగా ఉండాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి
ఎండాకాలంలో మైగ్రేన్ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఎండలో ఎక్కువసేపు నిలబడినా, పనిచేసినా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు ఉపయోగించాలి.