Viral Video: వైరల్‌ అయ్యేందుకు ఏదైనా చేస్తారా.? ఈ వీడియో చూసే మీరూ ఇదే అంటారు

A man doing eyebrows to buffalo video goes viral in social media
x

Viral Video: వైరల్‌ అయ్యేందుకు ఏదైనా చేస్తారా.? ఈ వీడియో చూసే మీరూ ఇదే అంటారు

Highlights

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎలాగైనా పాపులర్‌ అవ్వాలని అనుకుంటున్నారు. కనీసం తమ వీడియోలు వైరల్‌ అవ్వాలని ఆశపడుతున్నారు.

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎలాగైనా పాపులర్‌ అవ్వాలని అనుకుంటున్నారు. కనీసం తమ వీడియోలు వైరల్‌ అవ్వాలని ఆశపడుతున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇతరులు చేసే వీడియోలు చూసి కాలక్షేపం చేసే వారు కొందరైతే, తామే ఎలాగైనా ట్రెండ్‌ అవ్వాలని అనుకుంటున్న వారు మరి కొందరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు వైరల్‌ అవ్వాలని ఓ వింత పనిచేశారు.. ఇంతకీ ఏంటా పని తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సహజంగా ఐ బ్రోస్‌ ఎవరు చేయించుకుంటారు. ఇదేం ప్రశ్న మహిళలు చేయించుకుంటారు అంటారు కదూ! ఓ త్రెడ్‌ సహాయంతో కనుబొమ్మలను కట్‌ చేస్తుంటారు. ఇది కాస్త నొప్పితో కూడుకున్నది అయినా అందంగా కనిపించేందుకు ఇలా చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా గేదెకు ఐబ్రోస్‌ చేశాడు. ప్రశాంతంగా రెస్ట్‌ తీసుకుంటున్న ఓ గేదె దగ్గర కూర్చొని తాడు సహాయంతో వాటి ఐబ్రోస్‌ను కట్‌ చేశాడు.



దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. నా కొత్త బ్యూటీ పార్లర్‌, మీ సిస్టర్‌కి ట్యాగ్ చేయండి అనే ట్యాగ్‌లైన్‌తో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. వీడెవడురా బాబు మరీ ఇలా ఉన్నాడంటూ ఓ వ్యక్తి కామెంట్ చేస్తే మరొకరు గేదెకు ఐ బ్రో చేయడం ఏంటీ సామీ అంటూ స్పందిస్తున్నారు. అయితే ఆ గేదె వైల్డ్‌గా రియాక్ట్‌ అయితే ఈ బ్యూటీషియన్‌ పని ఏంటో అంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఎలాగైనా వైరల్ అవ్వాలనుకునే అతి తెలివిలో నుంచే ఇలాంటి దారుణాలు పుట్టుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు కదూ!



Show Full Article
Print Article
Next Story
More Stories