Viral: మగపాము చనిపోయింది.. పక్కనే 24 గంటలపాటు ఉండిపోయిన ఆడపాము

Viral
x

Viral: మగపాము చనిపోయింది.. పక్కనే 24 గంటలపాటు ఉండిపోయిన ఆడపాము

Highlights

Viral: ప్రేమ ఎవరికైనా ఒకటే. అప్పటివరకు కలిసి ఒక్కటిగా జీవించినవాళ్లలో ఒకరు సడన్‌గా చనిపోతే..మిగిలి ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది.

Viral: ప్రేమ ఎవరికైనా ఒకటే. అప్పటివరకు కలిసి ఒక్కటిగా జీవించినవాళ్లలో ఒకరు సడన్‌గా చనిపోతే..మిగిలి ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది. అది మనుషులకైనా జంతువులకైనా ఒకటే. భరించలేని బాధ, వేదనతో ఉండిపోతారు. మధ్యప్రదేశ్‌లో మెరోనాలో ఇలాంటి సంఘటనే జరిగింది. మగ పాము ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాదాపు 24 గంటల వరకు ఆడపాము పక్కనే ఉండిపోయింది. ఈ సంఘటనను చూసి హృదయం విలవిలలాడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ ఆడపాము కూడా చనిపోయందని స్థానికులు అంటున్నారు.

మధ్య ప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలోని ధుర్కుడా కాలనీలో ఈ సంఘటన జరిగింది. మగపాముని కోల్పోయిన ఆడపాము పక్కనే 24 గంటల పాటు ఉండిపోయింది. భాగస్వామిని విడిచి వెళ్లలేక, బతకలేక రోడ్డుపక్కనే తన ప్రాణాలను విడించిందట. ఈ సంఘటన స్థానికులకు కంటతడి పెట్టించింది.

రోడ్డు ప్రమాదంలో మగపాము చనిపోయింది. అప్పటికి ఆడపాము ఎక్కడో దూరంగా ఉంది. అయినా మగపాము చనిపోవడం చూసి, దగ్గరకువచ్చింది. అప్పటికే మగపాము చనిపోయింది. దీంతో దానిపక్కనే అలా ఉండిపోయింది. అటు ఇటు రోడ్డుపైన జనం తిరుగుతున్న కదలకుండా, బెదరకుండా అలానే మగపాము పక్కనే ఉండిపోయింది. ఆ తర్వాత రోజు కూడా ఆడపాము అక్కడే ఉండిపోవడంతో స్థానికులు షాక్ అయ్యారు. భాగస్వామిని విడిచివెళ్లలేకపోవడాన్ని చూసి కదిలిపోయారు. ఆ తర్వాత కొంత సేపటికి ఆ పాము కూడా చనిపోయిందని స్థానికులు చెప్పారు. అయితే ఈ జంట పాముల ప్రేమకు గుర్తుగా ఆ ఊరిలో స్థానికులు ఒక వేదిక నిర్మించాలని చూస్తున్నారు. అది ఈ పాముల ప్రేమకు గుర్తుగా ఎప్పటికీ ఉండిపోతుందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories