Viral Video: తలుపు వెనకాల ఊహించని అతిథి.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..!

Viral Video: తలుపు వెనకాల ఊహించని అతిథి.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..!
x
Highlights

Viral Video: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది.

Viral Video: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. ప్రతీ రోజూ వందలాది వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సరే వెంటనే అరచేతిలో వాలిపోతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయ్యింది.

ఉదయం లేవగానే ఇంటి తలుపు తీసి చూస్తే ఎంచక్కా చెట్లు కనిపించాలని కోరుకుంటాం. అదే ఆశతో ఉదయం డోర్‌ తీస్తాం. అయితే డోర్‌ తీసిన వెంటనే మన ఊహకందని వస్తువు కళ్ల ముందు కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.? గుండె ఆగినంత పని అవుతుంది కదూ? తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ వ్యక్తి డోర్‌ ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే డోర్‌ కాస్త ఓపెన్‌ చేయగానే ఎదుట ఒక పెద్ద చిరుత పులి కనిపించింది. దీంతో డోర్‌ను పూర్తిగా తెరవకుండా అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా ఆ పులిని గమనించింది. అయితే డోర్‌ అవతలా ఎవరో ఉన్నారన్న విషయాన్ని గమనించిన సదరు పులి ఒక్కసారిగా అటాక్‌ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో రెప్పపాటు క్షణంలో తలుపు మూసేసి లాక్‌ చేసేశాడు. ఇదంతా స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకేముంది ఈ వీడియో కాస్త నెట్టింట తెగ ట్రెండ్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో షాక్‌ అవుతున్నారు. బయట పులి ఉందన్న విషయం అతనికి ముందుగానే తెలిసి ఉండొచ్చని ఓ యూజర్‌ స్పందిస్తే.. మరో యూజర్‌ 'ఇలాంటి పరిస్థితి వస్తే గుండె జల్లుమనడం' ఖాయం అంటూ కామెంట్‌ చేశాడు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories