Solar Eclipse 2026: ఆకాశంలో అద్భుతం: రేపే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం.. నిప్పుల వలయంలా కనిపించనున్న భానుడు!

Solar Eclipse 2026: ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సూర్య గ్రహణం మంగళవారం రింగ్ ఆఫ్ ఫైర్‌గా కనువిందు చేయనుంది.
Solar Eclipse 2026: ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సూర్య గ్రహణం మంగళవారం రింగ్ ఆఫ్ ఫైర్‌గా కనువిందు చేయనుంది. వలయాకారంలో సూర్యుడి దర్శనాన్ని అందించే ఈ సూర్య గ్రహణం ప్రత్యేక ఖగోళ విశిష్టతను సంతరించుకుంది.
ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న సంభవిస్తుంది. ప్రతి సంవత్సరంలోనూ సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఈ ఏడాదిలోనూ తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడుతుంది. ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల్లోనే సూర్యగ్రహణం అగ్ని వలయంగా కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ ఎఫెక్ట్ అంటారు. ఇది మధ్యలో చీకటిగా చుట్టూ మండుతున్నట్లుగా కనువిందైన అగ్ని వలయ దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఈ రకమైన సూర్యగ్రహణం చంద్రుడు భూమి నుంచి దాని అత్యంత సుదూర బిందువు వద్ద లేదా సమీపంలో ఉన్నప్పుడు సంభవిస్తుంది.
రింగ్ ఆఫ్ ఫైర్ దశ అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 7గంటల 12 నిమిషాలకు ప్రారంభమై 1 నిమిషం 12 సెకన్ల పాటు ఉంటుంది. ఈ గ్రహణాన్ని పరిమితంగానే వీక్షించవచ్చు. చంద్రుడు సూర్యునికి , భూమికి మధ్యలో వెళ్లడంతో సూర్యుడు చాలావరకు కనిపించడు. దీంతో సూర్యుడి కంటే చంద్రుడు కొంత తక్కువగా ఉండటంతో వలయంలా ఏర్పడుతుంది.
రింగ్ ఆఫ్ ఫైర్ మార్గం అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఉండే లక్షలాది పెంగ్విన్‌లను ఈ గ్రహణం కొంత గందరగోళానికి గురి చేసే ఛాన్స్ ఉంది. అంటార్టికాలోనూ తక్కువ సామయం పాటు సూర్యగ్రహణం కనిపించనుంది. దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, ఫసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాలలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించే ఛాన్స్ లేదు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. సూర్య గ్రహణం భారత దేశంలో కనిపించకపోయినా దాని ప్రభావం రాశులపై నేరుగా పడుతుంది. అనేక రాశుల వారికి సానుకూల మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



