Asteroid: భూమి పైకి దూసుకొస్తున్న గ్రహశకలం.. గంటకు 51,732 కిమీ వేగం

Asteroid
x

Asteroid: భూమి పైకి దూసుకొస్తున్న గ్రహశకలం.. గంటకు 51,732 కిమీ వేగం

Highlights

Asteroid: అంతరిక్షం నుంచి ఒక గ్రహ శకలం భూమిపైకి శరవేగంతో దూసుకొస్తుందని శాస్త్ర్ వేత్తలు చెబుతున్నారు. దీని వేగం గంటకు 51,732 కిమీ ఉండడంతో అందరినీ భయాందోళనలకు గురి చేస్తుంది.

Asteroid: అంతరిక్షం నుంచి ఒక గ్రహ శకలం భూమిపైకి శరవేగంతో దూసుకొస్తుందని శాస్త్ర్ వేత్తలు చెబుతున్నారు. దీని వేగం గంటకు 51,732 కిమీ ఉండడంతో అందరినీ భయాందోళనలకు గురి చేస్తుంది. ఏ క్షణంలో ఇది భూమిని ఢీ కొడుతుందో తెలియడం లేదు. దీంతో దాని కదలికలను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పసిగట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంతరిక్షంలో లెక్కలేనన్ని గ్రహశకలాలు, ఉల్కలు ఉండటం సాధారణమే. అయితే ఒక్కోసారి అవి దారి తప్పి పోతుంటాయి. వాటి పక్కనే ఉన్న గ్రహాలను ఢీకొట్టే ప్రమాదాలు ఉంటాయి. ఇప్పటికే చాలా సార్లు కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్లాయి. కానీ ఇప్పుడు భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలాన్ని చూసి అందరూ ఆందోళన చెందుతున్నారు.

ఈ గ్రహశకలం పేరు 2005 వీఓ5. దీని ఎత్తు 648 మీటర్లు. అంటే కుతుబ్ మినార్ కంటే తొమ్మిది రెట్లు పెద్దది. దీని వెడల్పు 660 డయా మీటర్లు. ఇంత పెద్ద సైజు ఉన్న గ్రహశకలం భూమివైపుకు శరవేగంతో దూసుకురావడం ఇప్పుడు అందరిలో టెన్షన్ రేపుతోంది.

ఇప్పటికీ ఈ గ్రహశకలం గంటకు 51,732 కిమీ వేగంతో భూమి వైపుకి దూసుకొస్తుంది. ఈ వేగం ఎవరూ ఊహించలేనంతగా ఉంది. ముందు ముందు మరింతగా వేగం పెరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే అంతరిక్ష పరిశోధకలు దీనిపై ఒక కన్ను వేసి ఉంచారు. దాని కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ ఇప్పుడు ఇదే పనిలో ఉంది. దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు దాని కదలికలను నోట్ చేస్తుంది.

2005 వీఓ5 గ్రహశకలం ఇప్పుడున్న వేగంతో దూసుకొస్తే ఈ నెల 11 వ తేదీన భూమికి అతి సమీపంగా రావొచ్చని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది మన భూమికి 60,86,084 దూరంలో ఉంది. దీని వేగం ఇప్పటివరకు ఒకేలా ఉండడంతో దాని దూరాన్ని లెక్కించడం ఈజీ అవుతుంది. ఒకవేళ దీని వేగంలో మార్పులు వస్తే అది కష్టంగా మారుతుంది. అందుకే ప్రతిక్షణం ఇప్పుడు దానిపై కన్ను వేసి శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే ఇది భూమిని ఢీ కొడుతుందా? లేదా? అన్నదానిపై స్పష్టతలేదు. అయితే చాలా గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిపోతుంటాయి. ఈ గ్రహశకలం 1988 జులై 1న భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు రాబోతుంది. దీనిబట్టి చూస్తే 2062లొ ఇది మళ్లీ భూమిని సమీపించవచ్చని శాస్ర్రవేత్తలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories