ఫస్ట్ క్లాస్ ఫీజు రూ.7.35 లక్షలు..! మధ్యతరగతి తల్లిదండ్రులకు షాక్

ఫస్ట్ క్లాస్ ఫీజు రూ.7.35 లక్షలు..! మధ్యతరగతి తల్లిదండ్రులకు షాక్
x

ఫస్ట్ క్లాస్ ఫీజు రూ.7.35 లక్షలు..! మధ్యతరగతి తల్లిదండ్రులకు షాక్

Highlights

బెంగళూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల ఫీజు స్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.7.35 లక్షల ఫీజు వసూలు చేస్తున్న ఆ పాఠశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఫీజులు మధ్యతరగతి మాత్రమే కాదు, ఐటీ ఉద్యోగులకూ భరించలేనివని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక యూజర్ డి. ముత్తుకృష్ణన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీజు వివరాలను పంచుకున్నారు. ఆయన పోస్ట్ ప్రకారం—

1 నుండి 5వ తరగతి వరకు: సంవత్సరానికి రూ.7.35 లక్షలు

6 నుండి 8వ తరగతి వరకు: రూ.7.75 లక్షలు

9, 10వ తరగతులకు: రూ.8.5 లక్షలు

11, 12వ తరగతులకు: రూ.11 లక్షలు

అంతేకాక, ఒకేసారి రూ.1 లక్ష అడ్మిషన్ ఛార్జీ కూడా ఉంది.

ఈ వివరాలు చూసిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వార్షిక ఆదాయం రూ.50 లక్షలు ఉన్నా, ఇద్దరు పిల్లల చదువుకు ఈ ఫీజులు భరించడం అసాధ్యం అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

న్యాయవాది రాజేంద్ర కౌశిక్ మాట్లాడుతూ— ఇంత ఖరీదైన ఫీజులకు తల్లిదండ్రులే కారణమని వ్యాఖ్యానించారు. "ప్రైవేట్ పాఠశాలల్లో చదివితేనే పిల్లలకు కోటీశ్వర భవిష్యత్తు వస్తుందని నమ్మిన తల్లిదండ్రులే ఈ వ్యవస్థను సృష్టించారు. అసలు ఎక్కువ డబ్బు ఉపాధ్యాయుల జీతాలపై కాకుండా యాజమాన్యం జేబుల్లోకే వెళ్తోంది" అని ఆయన అన్నారు.

అదే సమయంలో, “ప్రతి ఒక్కరూ తమ పిల్లలను కనీసం రెండు సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తేనే ప్రైవేట్ పాఠశాలల ఫీజులు తగ్గుతాయి” అని కౌశిక్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories