viral video: పెళ్లి కూతురు పేరడీ రూపంలో పాట.. పడి పడి నవ్విన బంధువులు.. వీడియో వైరల్

Brides Daughter Funny Song Viral
x

పెళ్లి కూతురు పేరడీ రూపంలో పాట.. పడి పడి నవ్విన బంధువులు.. వీడియో వైరల్

Highlights

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. అమ్మాయి, అబ్బాయి పెళ్లి బంధంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. అలాంటి పెళ్లిలో సరదాలు సహాజమే. బావను మరదళ్లు, వదినను ఆడబిడ్డలు ఆటపట్టిస్తూ ఉంటారు.

viral video: పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. అమ్మాయి, అబ్బాయి పెళ్లి బంధంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. అలాంటి పెళ్లిలో సరదాలు సహాజమే. బావను మరదళ్లు, వదినను ఆడబిడ్డలు ఆటపట్టిస్తూ ఉంటారు. అలాంటి ఓ ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. వదినలపై పాట పాడిన ఆ వధువు పాటకు అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వారు. ఇంతకు ఆ వధువు పాడిన పాట ఏంటో మీరూ చూడండి.

సాధారణంగా పెళ్లైన తర్వాత నూతన వధూవరులు ఇంట్లోకి అడుగు పెట్టే ముందు వాళ్ల పేర్లు అడిగి లోపలికి పంపిస్తారు. ఇది వదిన, మరదళ్ల మధ్య జరిగే సరదా సన్నివేశం. ఈ సమయంలో వదిన, మరదళ్లు కొత్తగా పెళ్లైన అమ్మాయిని భర్త పేరు చెప్పాలని.. ఆ తర్వాతే లోపలికి పంపిస్తామని ఆటపట్టిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ వధువే వదినా మరదళ్లను ఆటపట్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొత్తగా పెళ్లైన వధూవరులిద్దరూ ఇంట్లోకి అడుగుపెడుతున్నారు. వెంటనే వదినామరదళ్లు ఆ పెళ్లి కూతురిని ఆటపట్టించే కార్యక్రమం మొదలుపెట్టారు. సహజంగా కొత్తగా పెళ్లైన పెళ్లి కూతుర్లు సిగ్గుతోనో, కొత్తదనం వల్లో, మొహమాటానికో సైలెంట్‌గా ఉంటారు. కానీ ఇక్కడ పెళ్లి కూతురు మాత్రం రివర్స్‌లో వారినే ఆటపట్టించింది. అది కూడా పాట రూపంలో.. మురారీ సినిమాలోని చందమామ.. చందమామ పాటను పేరడీ రూపంలో పాడుతూ అందరినీ నవ్వించింది. రాముడు లాంటి మీ అన్నయ్యకు నే జనాకినవుతాను.. వగలమారి వదినమ్మలతో నేతగువుకు రాలేను.. దేవత లాంటి అత్తయ్యకు నేతోడుగా ఉంటాను అంటూ వదినలను ఆటపట్టిస్తూనే.. మరో వైపు అత్తామామలను పొగుడుతూ పాట పాడి అందరినీ నవ్వించింది.

ఈ పెళ్లి కూతురు పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో చూసిన కొందరు నవ్వుకోగా.. మరికొందరు వదినలను సరదాగా భలే ఆటపట్టించావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ట్రెండ్ మారింది గురూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మొత్తానికి నెట్టింట వైరల్‌గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories