Chanakya Neeti: ఈ విషయాల్లో ఎప్పుడూ ప్రాంక్ చేయకండి..ప్రాణాలకే ప్రమాదం

Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం కొన్ని విషయాలతో ఎప్పుడూ తమాషాలు చేయకూడదు. ఇలాంటి ప్రాంక్ వీడియోల వల్ల కలిగే ప్రమాదాలు ఇక్కడ తెలుసుకోండి.

KVD Varma
Published on: 5 March 2026 8:38 AM IST
Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం కొన్ని విషయాలతో ఎప్పుడూ తమాషాలు చేయకూడదు.
X

Chanakya Neeti

Chanakya Neeti: తరాలు మారినా.. ఎంత ఆధునిక ప్రపంచంలోకి పరుగులు తీస్తున్నా.. మనిషి పాటించాల్సిన నీతి మాత్రం మారదు. ఏ కాలంలో చెప్పిన మంచి మాటలైనా ప్రపంచం ఉన్నంత వరకూ వాటి ప్రభావం మారదు. భారతావనిలో మానవ జీవితం ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? మానవ సంబంధాల విషయంలో మంచీ, చెడూ ఏమిటి? వంటి విషయాలను చెప్పే ఎన్నో పురాణాలున్నాయి. అలాగే ఎందరో చరిత్రను ప్రభావితం చేసిన వ్యక్తులు ఉన్నారు. వారిలో ఆచార్య చాణక్యుడు ఒకరు. ఆయన అర్ధనీతి, రాజనీతి తో పాటు మానవ సంబంధాల విషయంలో ఎన్నోవిధాలైన ఆచరణీయ మంచి విషయాలు చెప్పారు. అవి ఏ కాలంలోనైనా ఆచరణీయమే. వాటి నుంచి మనం నేర్చుకునే విషయాలు మన జీవితం సాఫీగా సాగిపోవడానికి ఉపయోగపడతాయి.

Chanakya Neeti: మనం జీవితంలో ఎన్నో విషయాలను చాలా లైట్ తీసుకుంటాం. జోక్ అని చెప్పుకుంటూ.. ఇప్పటి తరం అయితే ప్రాంక్ అని చెబుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. అవన్నీ తాత్కాలికంగా ఫన్ కోసం అయినప్పటికీ, అలా ప్రాంక్ చేయడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం చేసే ప్రాంక్ ప్రాణాల మీదకు తేవచ్చు. లేదా మన సంబంధాల మధ్య చిచ్చు పెట్టొచ్చు లేదా ఒక్కోసారి అవతలి వారి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. ఆచార్య చాణక్య ఎవరూ ఎప్పుడూ చేయకూడని ప్రాంక్స్ ఏమిటనేది ఆయన నీతి శాస్త్రంలో చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

పాములు:

ఆచార్య చాణక్యుడు పాముల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అవి కొన్నిసార్లు స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ, అవి ప్రమాదకరంగా మారవచ్చు. అవును, పాములు ఎప్పుడు కాటు వేస్తాయో మనం ఊహించలేం. ఒక్కోసారి పాములతో చేసే ప్రాంక్స్ వలన మన ప్రాణాలు పోవచ్చు లేదా పక్క వారి ప్రాణాల మీదకు రావచ్చు. అందువల్ల, వాటికి దూరంగా ఉండాలి. అలాగే, వాటితో ఆడుకోకపోవడం మంచిది.

అగ్ని:

నిప్పుతో ఎప్పుడూ ఏ విధంగానూ అల్లరి చేసే ప్రయత్నం చేయవద్దని చాణక్యుడు చెప్పారు. మనం నిప్పుతో జోక్ చేయడానికి లేదా దానితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ నిప్పు మనల్ని ఒక్క క్షణంలో బూడిద చేస్తుంది. ఒక్కోసారి ఒక్క నిప్పుకణం మన పరిసరాలన్నిటినీ నాశనం చేసేస్తుంది. అందుకే, ఎప్పుడూ నిప్పుతో చెలగాటం ఆడకూడదు.

నీరు:

కొంతమంది నీటిని చూసి పిచ్చిగా ప్రవర్తిస్తారు. నీటిలో ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఆచార్య చాణక్యుడు వీలైనంత వరకు నీటికి దూరంగా ఉండాలని, సముద్రం, నదులు వంటి చోట చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్నేహితులతో కలిసి రీల్స్ కోసమో లేదా ఫన్ కోసమో నదులు, సముద్రాలు, చెరువులు వంటి చోట నీటిలో తమాషాలు చేస్తే మన ప్రాణానికే కాదు మన స్నేహితుల ప్రాణాలకు కూడా ముప్పు తీసుకు వచ్చినవారం అవుతాం.

Chanakya Neeti: నిజమే కదా. ప్రాంక్స్ విషయంలో చాలా అంశాలకు దూరంగా ఉండడం మంచిది. అందులోనూ పాము, నీరు, నిప్పు ఈ అంశాలలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అవి తీవ్రమైన ప్రమాదాన్ని తెస్తాయి. అందువల్ల ఈ మూడు విషయాల్లోనూ ఎప్పుడూ జోక్ చేయాలని ప్రయత్నించకండి.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story