సరస్సులో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఏనుగుపై మొసలి దాడి.. ఎలా తప్పించుకుందో చూడండి

సరస్సులో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఏనుగుపై మొసలి దాడి.. ఎలా తప్పించుకుందో చూడండి
x
Highlights

నీటిలో ఉండే మొసలికి చాలా బలం ఉంటుంది. అదే బైటకు వస్తే అంత ప్రభావం చూపించదు. అందుకే మొసలి నీళ్లలో ఉంటే సింహాలు, పులులు, ఏనుగుల వంటి బలమైన జంతువులు సైతం వాటి జోలికి పోయేందుకు సాహసం చేయవు.

Crocodile attacks on elephant: అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. వాటికి దాహం వేస్తే సరస్సుల దగ్గరకు వెళ్లి నీళ్లు తాగుతుంటాయి. అయితే సరస్సుల్లో మొసళ్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. నీళ్లు తాగడానికి వచ్చిన జంతువులపై దాడులు చేస్తూ ఉంటాయి. నీళ్లల్లో ఉండే మొసళ్లకు పదేనుగుల బలం ఉంటుందని చెప్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ మొసలి బలం పనిచేయలేదు. సరస్సులో నీళ్లు తాగడానికి వెళ్లిన ఏనుగుపై దాడి చేసిన మొసలికి తన ప్రతాపాన్ని చూపించింది ఓ ఏనుగు. మొసలిపై ఎదురుదాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

నీటిలో ఉండే మొసలికి చాలా బలం ఉంటుంది. అదే బైటకు వస్తే అంత ప్రభావం చూపించదు. అందుకే మొసలి నీళ్లలో ఉంటే సింహాలు, పులులు, ఏనుగుల వంటి బలమైన జంతువులు సైతం వాటి జోలికి పోయేందుకు సాహసం చేయవు. కానీ ఒక్కోసారి అనుకోకుండా వాటికి చిక్కబోయి తప్పించుకుంటాయి. ఇక్కడ అలాంటి ఘటననే జరిగింది. దాడి చేయడానికి ప్రయత్నించిన మొసలిపై రివర్స్ దాడి చేసి తన ప్రాణాన్ని కాపాడుకుంది ఏనుగు.

ఒక ఏనుగుల గుంపు నీళ్లు తాగేందుకు అడవిలోని సరస్సు దగ్గరకు వెళ్లాయి. ఏనుగులు నీళ్లలోకి దిగగానే అక్కడున్న మొసళ్లు ఏనుగులపైకి దాడి చేశాయి. ఒక మొసలి, ఏనుగు తొండం పట్టుకుని దాన్ని నీళ్లలోకి లాగేందుకు ప్రయత్నించింది. అయితే ఏనుగు తన కాలితో మొసలిని నీళ్లలోకి తొక్కుతూ చుక్కలు చూపించింది. చివరికి మొసలి పట్టును విడిపించుకుని నీళ్లలోకి నెట్టేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొసలికి ఏనుగు భలే చుక్కలు చూపించిందని కొందరు.. స్థాన బలం ప్రతిసారి పనిచేయదని మరికొందరు కౌంటర్‌ ఇస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories