Viral Video: నదిలోకి మహిళను లాక్కెళ్లిన మొసలి.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: నదిలోకి మహిళను లాక్కెళ్లిన మొసలి.. వైరల్ అవుతున్న వీడియో..
x

Viral Video: నదిలోకి మహిళను లాక్కెళ్లిన మొసలి.. వైరల్ అవుతున్న వీడియో..

Highlights

Crocodile Drags Woman Video: ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో

Crocodile Drags Woman Video: ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో, వరద నీటితో పాటు మొసళ్లు కూడా జనావాసాల సమీపంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

బింఝార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంతియా గ్రామానికి చెందిన సౌదామిని అనే మహిళ నదిలో స్నానం చేస్తుండగా ఆమెపై మొసలి దాడి చేసింది. మొసలి ఒక్కసారిగా ఆమెను పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లిపోయింది.

నది ఒడ్డున ఉన్న స్థానికులు ఈ దారుణ దృశ్యాన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది వెంటనే ఆమెను కాపాడటానికి నీళ్లలోకి దిగి ప్రయత్నించినప్పటికీ, మొసలి మహిళను లోతువైపు లాక్కెళ్లినట్లు వారు తెలిపారు. ఈ ఘటనను కొందరు వీడియో తీయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నదిలో దిగి మహిళ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు నదులు, చెరువుల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories