Viral: పన్నీర్ కర్రీలో చనిపోయిన ఎలుక..! సగం తిన్నాక గమనించిన కస్టమర్ షాక్

Viral: పన్నీర్ కర్రీలో చనిపోయిన ఎలుక..! సగం తిన్నాక గమనించిన కస్టమర్ షాక్
x

Viral: పన్నీర్ కర్రీలో చనిపోయిన ఎలుక..! సగం తిన్నాక గమనించిన కస్టమర్ షాక్

Highlights

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటపడింది. బిల్సి పట్టణంలోని ఒక ధాబాలో భోజనం చేస్తున్న కస్టమర్ తన ప్లేట్‌లో చనిపోయిన ఎలుకను చూసి షాక్ అయ్యాడు. అతను అప్పటికే సగం భోజనం ముగించిన తర్వాతే ఆ విషయం గమనించాడు.

కస్టమర్‌కి పనీర్ కర్రీ–రోటీ సర్వ్ చేశారు. తినేటప్పుడే ప్లేట్‌లో వింతగా ఏదో కనిపించింది. చెంచాతో తిప్పి చూసేసరికి అది చనిపోయిన ఎలుక అని తెలిసింది. ఈ దృశ్యం చూసిన కస్టమర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

తర్వాత వెంటనే ధాబా యజమానికి ఫిర్యాదు చేసినా, సరైన సమాధానం రాకపోవడంతో కస్టమర్ నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ధాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రజల్లో ఆహార భద్రతపై ఆందోళన పెరిగింది. నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ, హోటళ్లలో పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

ఆహార భద్రతా శాఖ కఠిన చర్యలు తీసుకుంటేనే ధాబాలు, హోటళ్లు పరిశుభ్రత నియమాలను పాటిస్తాయని ప్రజలు అంటున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో, అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories