Digital India: ఒక రీల్ చేసి ఇస్తే.. రూ. 15వేలు ఫ్రైజ్ మనీ..!

Digital India Reel Contest Create a Reel and Win ₹15000
x

Digital India: ఒక రీల్ చేసి ఇస్తే.. రూ. 15వేలు ఫ్రైజ్ మనీ..!

Highlights

Reel Contest: సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారికి డిజిటల్ ఇండియా గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.

Reel Contest: సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారికి డిజిటల్ ఇండియా గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. డిజిటల్ ఇండియాపై మీరు ఒక రీల్ చేస్తే.. 15వేల రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించింది. అయితే ఆ రీల్ ఎలా చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి.. ఇప్పుడు తెలుసుకుందాం.

2015లో మన దేశంలో డిజిటల్ ఇండియా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం గ్రామాల నుండి నగరాల వరకు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. టెక్నాలజీతో ప్రజలను అనుసంధానం చేసింది. ఆన్ లైన్‌ సేవలు, యుపీఐ లావాదేవీలు, హెల్త్ కార్డులు, ఆధార్ లింక్ సర్వీస్.. ఇలా అన్నీ కూడా డిజిటిల్ ఇండియాలోని భాగం. అయితే ఇప్పుడు ఈ సంస్థ రీల్స్ అంటే పిచ్చిగా ఇష్టపడేవాళ్లకు ఒక శుభవార్తను తీసుకొచ్చింది. రీల్స్ చేస్తే ఫ్రైజ్ మనీ కూడా ఇవ్వనుంది. వివరాలు చూద్దాం.

ప్రభుత్వ డిజిటల్ ఇండియా దశాబ్ధం రీల్స్ పోటీని తీసుకొచ్చింది. జులై 1న ప్రారంభమైన ఈ పోటీ ఆగష్టు 1వరకు ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనేవారికి ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించింది. టాప్ 10 విజేతలకు రూ.15 వేల రూపాయలు, ఆ తర్వాత 25మందికి పదివేల రూపాయలు, ఎంపిక చేసిన 50 మందికి 5వేల రూపాయలు ఇవ్వనుంది.

రీల్ ఎలా చేయాలి?

డిజిటల్ ఇండియాకు సంబంధించిన ఆన్ లైన్ సేవలు, డిజిటల్ విద్య్, ఆరోగ్య సేవలు, డిజిటల్ మనీతో మీ లైఫ్ బాగుంటే దాన్ని ఒక క్రియేషన్‌గా చేయాలి. ఈ రీల్ కనీసం ఒక నిమిషం నిడివి ఉండాలి. వీడయో కూడా ఒరిజనల్‌ది అయి మాత్రమే ఉండాలి. అంటే అంతకుముందు ఏ ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లలో అది పోస్ట్ చేసి ఉండకూడదు. అంతేకాదు ఏ భాషలో అయినా ఈ రీల్ చేయొచ్చు. ప్రోట్రెట్ మోడ్, ఎమ్‌పీ4 ఫార్మాట్‌లో ఉన్న రీల్స్‌ ని మాత్రమే అంగీకరిస్తారు. ముఖ్యంగా ఈ రీల్‌లో డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది. అనేది మాత్రమే ఉండాలి.

ఎలా పంపాలి?

రీల్స్ పూర్తయిన వెంటనే ప్రభుత్వ అదికారిక వెబ్ సైట్ https://www.mygov.in/task/decade-digital-india-reel-contestలో పోస్ట్ చేయాలి. అప్పుడు సెలెక్ట్ అయిన వీడియోకి సంబంధిత అధికారులు ప్రైజ్ మనీని ట్రాన్స్ ఫర్ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories