ప్రతి నెల ఎక్కువ పెన్షన్ పొందాలంటే?:ఏం చేయాలో తెలుసా?

Do you know how to get high pension monthly
x

ప్రతి నెల ఎక్కువ పెన్షన్ పొందాలంటే?:ఏం చేయాలో తెలుసా

Highlights

ఈపీఎస్ ద్వారా ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు. ఎక్కువ సంవత్సరాల పాటు ఉద్యోగం చేయకున్నా కూడా మీకు ఈ పథకం ద్వారా నెల నెలకు పెన్షన్ లభిస్తుంది.

ఈపీఎస్ ద్వారా ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు. ఎక్కువ సంవత్సరాల పాటు ఉద్యోగం చేయకున్నా కూడా మీకు ఈ పథకం ద్వారా నెల నెలకు పెన్షన్ లభిస్తుంది. అయితే ఈ పథకం గురించి తెలుసుకుందాం.ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ పథకం కింద ప్రతి నెల పెన్షన్ అందించే పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అయితే ఈ పథకం కింద ప్రతి ఉద్యోగికి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి నెల ఆ ఉద్యోగికి దక్కే వేతనం ఆ ఉద్యోగి ఎంత కాలం పనిచేశారనే విషయాలను ఆధారంగా ప్రతి నెల చెల్లించే పెన్షన్ అధారపడి ఉంటుంది. ఉద్యోగి బేసిక్ వేతనం నుంచి 8.33 శాతం ఈపీఎస్‌కు, మిగిలిన 367 శాతం ఈపీఎఫ్ పథకానికి చెల్లిస్తారు.

ఉద్యోగులు రిటైరైన తర్వాత కనీసం వెయ్యి రూపాయాల పెన్షన్ చెల్లిస్తారు. గరష్టంగా 7500 తీసుకోవచ్చు. అయితే పెన్షన్ ఆయా ఉద్యోగులు సర్వీస్ ఆధారంగా హెచ్చు తగ్గులు ఉంటుంది. రిటైర్ కావడానికి ముందు కూడా పెన్షన్ తీసుకోనే ఆఫ్షన్ కూడా ఉంది. దీన్నీ ఈపీఎస్ ఎర్లీ పెన్షన్ గా పిలుస్తారు. అయితే ఈ పెన్షన్ తీసుకోవాలనే ఉద్యోగుల వయస్సు 50 గా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.

రిటైరైన తర్వాత ఎక్కువ పెన్షన్ పొందాలంటే రిటైరయ్యే సమయానికి ఎక్కువ జీతం తీసుకోవాలి. లేదా ఎక్కువ కాలం పాటు ఉద్యోగం చేయాలి. దీనికి తోడు పెన్షన్ స్కీమ్ కింద ప్రతి నెలా డబ్బులు జమ కావాలి. ఈపీఎస్ లో సభ్యత్వం కలిగి ఉన్న సభ్యుడు మరణస్తే ఆయన సూచించిన నామినీకి పెన్షన్ అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories