Quasi-Moon: సూర్యుడి చుట్టూ తిరిగే 'బుల్లి చందమామ'.. శాస్త్రవేత్తల పరిశోధన!

Quasi-Moon
x

Quasi-Moon: సూర్యుడి చుట్టూ తిరిగే 'బుల్లి చందమామ'.. శాస్త్రవేత్తల పరిశోధన!

Highlights

Quasi-Moon: సూర్యుడి చుట్టూ తిరుగుతూ, భూమికి దగ్గరగా ఉండే ఒక చిన్న 'చందమామ'ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. నిజానికి ఇది ఒక గ్రహశకలం. దీనికి '2025 పీఎన్‌7' అని పేరు పెట్టారు.

Quasi-Moon: సాధారణంగా మనం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడని భావిస్తాం. అయితే, సూర్యుడి చుట్టూ తిరుగుతూ, భూమికి దగ్గరగా ఉండే ఒక చిన్న 'చందమామ'ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. నిజానికి ఇది ఒక గ్రహశకలం. దీనికి '2025 పీఎన్‌7' అని పేరు పెట్టారు. ఇది భూమి లాగే సూర్యుడి చుట్టూ ఒక ఏడాదిలో పూర్తి ప్రదక్షిణ చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఏమిటీ 'క్వాసీ మూన్స్'?

ఇలాంటి అంతరిక్ష శిలలను శాస్త్రవేత్తలు 'క్వాసీ మూన్స్' (Quasi-moons) అని పిలుస్తారు. ఇవి భూమి చుట్టూ తాత్కాలికంగా తిరిగే 'మినీ మూన్స్'కు భిన్నంగా ఉంటాయి. గతంలో '2024 పీటీ5' అనే మినీ మూన్ రెండు నెలల పాటు మాత్రమే భూమి చుట్టూ తిరిగింది. '2025 పీఎన్‌7' మాత్రం చాలా కాలంగా భూమికి సమీపంలో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది.

దశాబ్దాలుగా మనకు తెలియని 'బుల్లి చందమామ'

'2025 పీఎన్‌7'ను గత నెల 29న హవాయ్‌లోని పాన్‌-స్టార్స్ అబ్జర్వేటరీలో గుర్తించారు. అయితే, పాత డేటాను పరిశీలించగా ఇది దశాబ్దాలుగా భూమి సమీప కక్ష్యలో తిరుగుతున్నట్లు వెల్లడైంది. ఇది చాలా చిన్నగా, మసకగా ఉండడం వల్ల ఇంతకాలం శాస్త్రవేత్తల కంటపడలేదని భావిస్తున్నారు.

ఈ బుల్లి గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మనకు, దానికి మధ్య దూరం 3 లక్షల కిలోమీటర్లు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఇది మరో 60 ఏళ్ల పాటు భూమికి సమీపంలోనే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి సమీపంలో ఇలాంటి క్వాసీ చందమామలు చాలా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories